అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి మెడికల్ కళాశాల (Kamareddy Medical College) ప్రిన్సిపాల్‌గా డాక్టర్ వాల్యా, జిల్లా జనరల్ ఆస్పత్రి(District General Hospital kamareddy) సూపరింటెండెంట్‌గా వెంకటేశ్వర్‌ను నియమితులయ్యారు. ఈ మేరకు హెల్త్ సెక్రెటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ(Dr. Christina Z.Chongthu) ఉత్తర్వులు జారీ చేశారు.
గాంధీ మెడికల్ కళాశాలలో (Gandhi Medical College) ఆర్థోపెడిక్ ప్రొఫెసర్‌గా వాల్యా పనిచేశారు. అలాగే మహేశ్వరం మెడికల్ కళాశాలలో (Maheshwaram Medical College) జనరల్ సర్జరీ ప్రొఫెసర్‌గా వెంకటేశ్వర్లు కొనసాగారు. ప్రస్తుతం ఈ ఇద్దరికి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిరువురు మెడికల్, జీజీహెచ్‌లో పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Kamareddy | ఇన్నాళ్లూ ఇన్ఛార్జీల పాలన..
కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఇప్పటివరకు ప్రొఫెసర్ శివప్రసాద్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఫరీదా బేగం ఇన్ఛార్జీలుగా కొనసాగారు. అయితే ఆరోగ్యశ్రీ నిధుల విషయంలో జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల హెల్త్ డైరెక్టర్ జిల్లా ఆస్పత్రి తనిఖీ సమయంలోనూ ఆమె ముఖం చాటేశారన్న ఆరోపణలున్నాయి. ఇది జరిగిన కొద్దిరోజులకే ఆమె స్థానంలో కొత్తగా పూర్తిస్థాయిలో సూపరింటెండెంట్ రావడం గమనార్హం.