అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad | నిజామాబాద్ (Nizamabad) నగరంలోని వైశ్య సంఘం (Vyshya Sangam) ఎన్నికలు ఆదివారం (నేడు) నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పలువురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు మించి ప్రచారాలు చేయడం గమనార్హం. రెండు ప్యానళ్లు, నాలుగు సంఘాలకు పోటీ పడుతున్నాయి. గతంలో వైశ్య యువజన సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. పట్టణ సంఘంతో పాటు మూడు అనుబంధ సంఘాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Nizamabad | ప్రారంభమైన ఓటింగ్
పట్టణ వైశ్యసంఘంతో పాటు శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల (Manik Bhavan), పట్టణ ఆర్యవైశ్య భవన్ (కల్యాణ మండపం) పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మాణిక్ భవన్ పాఠశాలలో ఉదయం 8 గంటలకు ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. సోమవారం కన్యకాపరమేశ్వరి ఆలయం (Kanyaka Parameswari Temple)లో కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. కాగా నగరంలో 10,017 మంది ఓటర్లు ఉన్నారు.
Nizamabad | రసవత్తరంగా పోటీ
పట్టణ సంఘంతో పాటు అనుబంధ సంఘాల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అర్వపల్లి పురుషోత్తం గుప్తా, ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా ప్యానళ్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. నూతన వైశ్య ఉన్నత పాఠశాల పాలవర్గానికి గజవాడ హనుమంతురావు, ఇంగు శివప్రసాద్ పోటీ పడుతున్నారు. నగరంలోని వైశ్యభవన్ పాలకవర్గానికి ఇల్లెందుల సుధాకర్, విశ్వనాథం నారాయణ పోటీ చేస్తున్నారు. కన్యకాపరమేశ్వరి ఆలయానికిబాశెట్టి విశ్వనాథం, పాల్తి రవికుమార్ ప్యానెళ్లు పోటీలో ఉన్నాయి.