అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vaisakhi month : తెలుగు సంవత్సరంలో వైశాఖ మాసం రెండో నెల. ఈ మాసంలో విశాఖ నక్షత్రంతో చంద్రుడు ఉంటాడు, కావున ఈ నెలకు వైశాఖ మాసంగా పేరు వచ్చింది. ఈ మాసం లక్ష్మీ నారాయణులకు ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో వివాహాలు, గృహా ప్రవేశాలు, ఉపనాయనాలు, సీమంతం, శంకుస్థాపనాల వంటి శుభకార్యాలు చేయడం శుభప్రదంగా పేర్కొంటారు.
ఆది నుంచి హిందువులు వివాహం, గృహ ప్రవేశం, నామకరణం, వ్యాపారం ప్రారంభించడం, అన్నప్రాసన, ఉపనయనం వంటి శుభకార్యాలు చేసుకోవడానికి మంచి రోజు, సమయాన్ని ఎంచుకునే సంప్రదాయం కొనసాగుతోంది. ఏదైనా శుభ కార్యం చేసే ముందు ముహూర్తం పరిగణనలోకి తీసుకుంటారు.
శుభకార్యాలకు వైశాఖం అత్యం పవిత్ర మాసం. ఈ నెలలో వివాహాల సందడి ఎక్కువగానే ఉండబోతోంది. ఓ వైపు భానుడు భగభగలతో అల్లాడిస్తున్నాడు. అయినా శుభ కార్యాలు అధికంగా నే ఉండనున్నాయి.
Vaisakhi month : మే నెలలో శుభ ముహూర్తాలు ఏమేంటో చూద్దామా..
1, 5, 6, 8, 9, 10, 14, 15, 16, 17, 18, 22, 23, 24, 27, 28 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. 28వ తేదీన జ్యేష్ట మాసం ప్రారంభం కానుంది.