అక్షరటుడే, వెబ్‌డెస్క్: Raashi Khanna | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ (Harish Shankar) తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh). గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఇది. మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల అనే విషయం అందరికి తెలిసిందే.
తాజాగా మరో హీరోయిన్ రాశీ ఖన్నా ఈ ప్రాజెక్ట్‌లో చేరినట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమా కథాంశం తమిళ సూపర్ హిట్ ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్’ పేరుతో విడుదలైంది) చిత్రానికి ఆధారంగా తెరకెక్కుతోంది. అయితే ఇది కచ్చితమైన రీమేక్ కాదు. దర్శకుడు హరీష్ శంకర్, మూల కథలో కొన్ని మార్పులు చేసి, ప్రేక్షకులకు సరికొత్త కంటెంట్‌ని అందించనున్నారు.
Raashi Khanna | సెకండ్ హీరోయిన్..
‘తెరి’లో హీరో విజయ్ సరసన సమంత మరియు అమీ జాక్సన్ కథానాయికలుగా నటించారు. ఈ నేపథ్యంలో తెలుగులోకి వచ్చే సరికి సమంత పాత్రను శ్రీలీల (Heroine Sreeleela) పోషిస్తుండగా, అమీ జాక్సన్ పాత్రకు రాశీ ఖన్నా ఎంపికైనట్లు సమాచారం. ఇప్పటికే రాశీ షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలిసింది. ఇటీవల ఆమె తన షూటింగ్‌కు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘నో స్పాయిలర్స్’ అంటూ పోస్ట్ చేసి ఆసక్తి రేపారు. మొదట్లో పవన్ సరసన సాక్షి వైద్య పేరుని పరిశీలించినప్పటికీ, ఇప్పుడు ఆ స్థానంలో రాశీ ఖన్నా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అదే మేజిక్ ఈసారి కూడా రిపీట్ అవుతుందనే అంచనాలు నెలకొన్నాయి.
మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) షూటింగ్‌కు సమయం ఇవ్వడంతో షూటింగ్ త్వరగా జరుగుతోంది. వీలైనంత తొందరగా సినిమా పూర్తి చేసి, థియేటర్లలో విడుదల చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. పవన్ అభిమానులకు ఇది డబుల్ ధమాకా . పవన్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు, మళ్లీ దేవి సంగీతం అందించడం, గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.