అక్షరటుడే, వెబ్‌డెస్క్:Ustad Bhagat Singh | ఇన్నాళ్లు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రానున్న రోజులలో వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించబోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన హరి హర వీరమల్లు చిత్రం విడుదలకు సిద్ధమైంది. జులై 24న చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) చిత్రాలు కూడా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి. ఈ రెండు సినిమాల నుంచి ప్రత్యేక వీడియోలను అభిమానుల కోసం విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో స్పెషల్ వీడియోలు విడుదల చేయాలని అనుకుంటున్నారట.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి గతంలో ఓ ఎనర్జిటిక్ గ్లింప్స్ విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నెక్ట్స్ సెప్టెంబర్ 2న ఈ చిత్రం నుంచి పవర్ ఫుల్ డైలాగ్స్ తో కూడిన ప్రత్యేకమైన వీడియోను రిలీజ్ చేసేందుకు హరీశ్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఇప్పటికే కథానాయికగా శ్రీలీల(Heroine Srileela) నటిస్తుండగా.. మరో కథానాయికగా రాశీ ఖన్నా(Heroine Raashi khanna) ఎంపికైనట్లు ప్రచారం జరిగింది. రాశీ ఖన్నా ఇప్పటికే షూటింగ్ సెట్‌లో అడుగు పెట్టి, పవన్ కళ్యాణ్‌తో కలిసి కీలక సన్నివేశాల్లో పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమా నుండి క్రేజీ అప్‌డేట్ వచ్చింది.
కొద్ది సేపటి క్రితం మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) రాశీ ఖన్నా పోస్టర్ విడుదల చేశారు. శ్లోక అనే పాత్రలో రాశీ ఖన్నా కనిపించనున్నట్టు అధికారికంగా తెలియజేశారు. చిత్రంలో రాశీ ఖన్నా ఫొటోగ్రాఫర్‌గా కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం రాశీ ఖన్నా పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.