అక్షరటుడే, వెబ్‌డెస్క్: One Big Beautiful Bill : అమెరికా సెనెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తాను అనుకున్న బిల్లులను చకచకా అమల్లోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో విప్లవాత్మక బిల్లుకు శ్రీకారం చుట్టారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపించే ప్రోగ్రాంకు నిధులు కేటాయించేందుకు ట్రంప్ తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ (Big Beautiful Bill)కు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. 51-50 ఓట్ల తేడాతో ఈ బిల్లు సెనెట్లో గట్టెక్కింది.
One Big Beautiful Bill : గట్టెక్కించిన యూఎస్ ఉపాధ్యక్షుడు..
‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’కు సెనెట్లో అంత త్వరగా ఆమోదం లభించలేదు. ఎందుకంటే 50-50 ఓట్లు రావడమే ఇందుకు కారణం. సరిసమానంగా ఓట్ల రావడంతో యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ US Vice President J.D. Vance టై బ్రేకర్ మారి ముందుకొచ్చారు. బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. అనంతరం సెనెట్లో బిల్లు ఆమోదం పొందిందని ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రకటించారు. దీంతో రిపబ్లికన్లు సభలో లేచి చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, ముగ్గురు రిపబ్లిన్ సభ్యులు సుసాన్ కొలిన్స్ (మైన్)Susan Collins (Maine), థామ్ టిల్లిస్ (నార్త్ కరోలినా) Thom Tillis (North Carolina), రాండ్ పాల్ (కెంటకీ) Rand Paul (Kentucky) మాత్రం ఈ బిల్లును వ్యతిరేకించారు. సెనెట్లో ఆమోదం పొందిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ తదుపరి ఓటింగ్ కోసం ప్రతినిధుల సభకు పంపిస్తారు. అక్కడ మెజారిటీ సభ్యుల ఆమోదం పొందాక యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వద్దకు పంపుతారు.
ఈ బిల్లులో మార్పులు చేర్పులు చేయాలనుకుంటే.. మళ్లీ సెనెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. 940 పేజీలతో కూడిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’పై సెనెట్ లో సుదీర్ఘ చర్చనే కొనసాగింది. ఈ బిల్లు చట్టంగా మారేందుకు రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న కాంగ్రెస్కు ట్రంప్ జూలై 4 వరకు గడువు ఇచ్చారు.