More
    Homeబిజినెస్​PRE MARKET ANALYSIS | ఇరాన్​పై యూఎస్ దాడి.. ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు

    PRE MARKET ANALYSIS | ఇరాన్​పై యూఎస్ దాడి.. ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PRE MARKET ANALYSIS : గ్లోబల్‌ మార్కెట్(Global markets)లు నష్టాలతో కదలాడుతున్నాయి. యూరోప్‌ మార్కెట్లు మాత్రమే పాజిటివ్‌గా ముగియగా.. యూఎస్‌ మార్కెట్లు నష్టపోయాయి. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌తోపాటు ఆసియా మార్కెట్లు నెగెటివ్‌గా స్పందిస్తున్నాయి.

    PRE MARKET ANALYSIS : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    గత ట్రేడింగ్‌ సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌ నష్టాలతో ముగిసింది. నాస్‌డాక్‌(Nasdaq) 0.51 శాతం, ఎస్‌అండ్‌పీ 0.22 శాతం నష్టపోయాయి. సోమవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 0.36 శాతం నష్టంతో ఉంది.

    PRE MARKET ANALYSIS : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    యూరోప్‌ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. డీఏఎక్స్‌(DAX) 1.26 శాతం, సీఏసీ 0.48 శాతం పెరగ్గా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.20 శాతం నష్టపోయింది.

    PRE MARKET ANALYSIS : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ప్రధాన ఆసియా మార్కెట్లు మిశ్రమంగా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.84 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.72 శాతం, హంగ్‌సెంగ్‌ 0.63 శాతం, నిక్కీ 0.57 శాతం, కోస్పీ 0.51 శాతం, షాంఘై 0.08 శాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.52 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు భారీ గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    READ ALSO  Globe Civil Projects IPO | రేపటి నుంచి ఓపెన్‌ అవ్వనున్న మరో ఐపీవో.. గ్రే మార్కెట్‌ ప్రీమియం ఎంతంటే..

    PRE MARKET ANALYSIS : గమనించాల్సిన అంశాలు..

    ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా నాలుగో రోజూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. శుక్రవారం నికరంగా రూ. 7,940 కోట్ల విలువైన స్టాక్‌ కొన్నారు. చాలా రోజుల తర్వాత డీఐఐలు నికర అమ్మకందారులుగా నిలిచారు. నికరంగా రూ. 3,049 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డీఐఐలు నికర అమ్మకందారులుగా నిలవడం మే 19వ తేదీ తర్వాత ఇదే తొలిసారి.

    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.03 నుంచి 1.16కు పెరిగింది. విక్స్‌ 4.09 శాతం తగ్గి 13.67కు తగ్గింది. పీసీఆర్‌ పెరగడం, విక్స్‌(VIX) తగ్గడం బుల్స్‌ కంఫర్ట్‌ జోన్‌ను సూచిస్తున్నాయి.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 1.69 శాతం పెరిగి 78.58 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 15 పైసలు బలపడి 86.59 వద్ద ఉంది.
    • యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌ 98.95 వద్ద ఉండగా.. యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.40 వద్ద నిలిచాయి.
    READ ALSO  Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    ఇరాన్‌పై అమెరికా ప్రత్యక్ష దాడికి దిగడంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో ప్రపంచ చమురు, గ్యాస్‌ సరఫరాలో కీలకమైన హర్మూజ్‌ జల సంధిని ఇరాన్‌ మూసి వేయవచ్చన్న అభిప్రాయాన్ని మార్కెట్‌ అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో చమురు ధరలకు రెక్కొలొచ్చే అవకాశాలున్నాయి. గత ట్రేడిరగ్‌ సెషన్‌లో బ్రెంట్‌(Brent) ముడి చమురు ధర భారీగా పెరిగింది. ఇది భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రతికూలం.

    ఈరోజు జూన్‌ నెలకు సంబంధించి హెచ్‌ఎస్‌బీసీ తయారు చేసిన మన దేశ సేవల పీఎంఐ ఫ్లాష్‌ డాటా విడుదల కానుంది.

    ఈ నెల 24, 25 తేదీలలో అమెరికా ఫెడ్‌ చైర్మన్‌(Fed chairman) పొవెల్‌ అమెరికా ఆర్థిక వ్యవస్థపై తన అభిప్రాయాలను వివరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండే అవకాశాలున్నాయి.

    READ ALSO  Indogulf Crop sciences IPO | మార్కెట్‌లోకి మరో ఐపీవో.. గ్రే మార్కెట్ ప్రీమియం ఎంతంటే..

    Latest articles

    ACB Trap | లంచం తీసుకుంటూ దొరికిన అకౌంట్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏసీబీ...

    CM Revanth Reddy | డ్రగ్స్‌ నియంత్రణకు కీలక చర్యలు.. ఈగల్‌ వ్యవస్థ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో డ్రగ్స్​ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి...

    Mahabubabad | కుబేర‌ సినిమా చూస్తుండ‌గా కూలిన సీలింగ్.. పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubabad | ఈ రోజుల్లో ప్ర‌జ‌ల ప్రాణాల‌కు గ్యారెంటీ లేకుండా పోయింది. బ‌స్సులో వెళ్లినా,...

    Jagannath Rath Yatra | జగన్నాథుడి సేవలో అదానీ.. 40 లక్షల మందికి ఉచితంగా ఆహారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagannath Rath Yatra | దేశంలో ఎంతో ఘనంగా జరిగే పూరి జగన్నాథుడి రథయాత్రకు...

    More like this

    ACB Trap | లంచం తీసుకుంటూ దొరికిన అకౌంట్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏసీబీ...

    CM Revanth Reddy | డ్రగ్స్‌ నియంత్రణకు కీలక చర్యలు.. ఈగల్‌ వ్యవస్థ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో డ్రగ్స్​ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి...

    Mahabubabad | కుబేర‌ సినిమా చూస్తుండ‌గా కూలిన సీలింగ్.. పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubabad | ఈ రోజుల్లో ప్ర‌జ‌ల ప్రాణాల‌కు గ్యారెంటీ లేకుండా పోయింది. బ‌స్సులో వెళ్లినా,...