ePaper
More
    HomeజాతీయంKanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక...

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై కొందరు దుర్మార్గులు క్రూరంగా వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కూడా ఇలాంటి ఓ వీడియో వైరల్​ అవుతోంది.

    కన్వర్​ యాత్రికులకు విక్రయించే జ్యూస్​లో కొందరు వ్యాపారులు మూత్రం కలిపి విక్రయిస్తున్నట్లు ఇటీవల సోషల్​ మీడియాలో హల్​చల్​ అవుతోంది.

    దీనికితోడు కన్వర్​ యాత్రికులు వెళ్లే మార్గంలో గాజు పెంకులు కూడా వేయడం సంచలనంగా మారింది. అయితే, దీనిపై పోలీసులు వివరణ ఇస్తూ.. ఓ రిక్షావాలా గాజు బాటిళ్లు తీసుకెళ్తూ కింద పడేసుకున్నాడని, అందుకే గాజు ముక్కలు రోడ్డుపై ఉన్నాయని చెప్పుకొచ్చారు. కానీ, పోలీసులు చెప్పినట్లు అలా పగిలిపోతే ఒకేచోట గాజు ముక్కలు ఉండాలి కానీ, కిలోమీటర్ల మేర పొడవున గాజు ముక్కలు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. కావాలనే భక్తులకు అసౌకర్యం కలిగించాలనే దురుద్దేశంతో రోడ్డుపై ఇలా గాజు ముక్కలు వేసినట్లు చెబుతున్నారు.

    READ ALSO  PM Modi | భారత ఆయుధాల వైపు.. ప్రపంచ దేశాల చూపు : ప్రధాని మోదీ
    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులకు జ్యూస్​లో మూత్రం..! సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులకు జ్యూస్​లో మూత్రం..! సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

    Kanwar Yatra : లైసెన్స్ ప్రదర్శించాల్సిందే..

    కన్వర్​ యాత్రికులపై జరుగుతున్న అన్యాయాలపై యూపీ రాష్ట్ర సర్కారు స్పందించింది. యాత్రికులకు విక్రయించే వస్తువులపై బార్​ ముద్రించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కన్వర్ యాత్ర మార్గంలో దాబాలు, రెస్టారెంట్ల నిర్వాహకులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సదరు యజమానులు లైసెన్స్, రిజిస్ట్రేషన్ సమాచారం బహిరంగంగా ప్రదర్శించాల్సించాలని స్పష్టం చేసింది. కానీ, వారి మతం, ఇతర వ్యక్తిగత వివరాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదన్నట్లు పేర్కొంది.

    Kanwar Yatra : కన్వర్​ యాత్ర అంటే..

    ఉత్తర భారత్​లో పరమేశ్వరుడి భక్తులు చేపట్టే కాడాల యాత్ర. శ్రావణ మాసంలో భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి, భుజాన కాడాలు(ఒక వెదురు కర్రకు ఇరువైపులా తాళ్లతో చెంబులను వేలాడదీస్తారు) భుజాన వేసుకుని వందల కిలోమీటర్లు చెప్పులు లేకుండా కాలి నడకన ప్రయాణిస్తుంటారు. అలా సుదూర తీరాన ఉన్న గంగానదికి చేరుకుంటారు.

    READ ALSO  Bank Scam | కాంగ్రెస్ మాజీ ఎంపీ కుల్దీప్ శ‌ర్మ అరెస్టు.. అండ‌మాన్ నికోబార్ బ్యాంక్ కుంభ‌కోణం కేసు..

    అక్కడ కావిళ్ళలో గంగానది నీటిని నింపుకొని మళ్లీ తిరుగు ప్రయాణం అవుతారు. తమ గ్రామానికి చేరుకుని, కావిళ్లలోని నీటితో శివలింగానికి జలాభిషేకం చేస్తారు. ఇలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

    ముఖ్యంగా శ్రావణ మాసంలో మాస శివరాత్రి పర్వదినాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. ఈ రోజున శివాలయాల్లో శివుడి లింగానికి అభిషేకం చేస్తారు. కన్వర్​ యాత్ర గురించి శివ పురాణంలో, లింగ పురాణంలోనూ ప్రస్తావన ఉందంటే.. ఇది ఎంతంటి పురాణ ఆచారమో అర్థం చేసుకోవచ్చు.

    Latest articles

    Railway Passengers | రైల్వే ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. ఎమ‌ర్జెన్సీ కోటా నిబంధ‌న‌ల్లో మార్పులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Railway Passengers | మీరు ఎమ‌ర్జెన్సీ కోటా ద్వారా త‌ర‌చూ టిక్కెట్లు బుక్ చేసుకుంటారా? అయితే, ఒక...

    Fighter Jet Crash | బంగ్లాదేశ్​ విమాన ప్రమాద బాధితులకు అండగా భారత్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Fighter Jet Crash | బంగ్లాదేశ్ రాజధానిలో శిక్షణ యుద్ధ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఓ...

    TATA AIA | ఎండీఆర్టీ ర్యాంకింగ్స్‌లో టాటా ఏఐఏకు అగ్రస్థానం

    అక్షరటుడే, ముంబై: TATA AIA | ఆర్థిక సేవల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంటూ టాటా ఏఐఏ లైఫ్...

    Nagarjuna Sagar | కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్​కు భారీగా వరద

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagarjuna Sagar | తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కర్ణాటకలో భారీ వర్షాలు పడుతున్నాయి....

    More like this