Akshara Today Desk: UPSC CSE Results | యూపీఎస్సీ (UPSC) సివిల్స్ – 2024 రిజల్ట్స్ వచ్చేశాయి. శక్తి దుబే తొలి ర్యాంకుతో సత్తా చాటారు. హర్షిత గోయల్ (2), అర్చిత్ పరాగ్ (3), షా మార్గి చిరాగ్(4), ఆకాశ్ గార్గ్ (5) స్థానాల్లో నిలవగా.. కోమల్ పునియా(6), ఆయుషీ బన్సల్(7), రాజ్‌కృష్ణ ఝా(8), ఆదిత్య విక్రమ్ అగర్వాల్ (9), మయాంక్ త్రిపాఠి(10) ర్యాంకులు సాధించారు. కాగా.. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు తమ సత్తా చాటారు.
UPSC CSE Results | సివిల్స్‌లో మెరిసిన తెలుగువాళ్లు వీరే..
సివిల్స్ రిజల్ట్స్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు విద్యార్థులు సత్తా చాటారు. సాయి శివాని 11వ ర్యాంకు సాధించగా.. బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్ కుమార్ రెడ్డి 62 ర్యాంకులతో మెరిశారు. సాయి చైతన్య జాదవ్ 68, ఎన్.చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119, చల్లా పవన్ కల్యాణ్ 146, శ్రీకాంత్ రెడ్డి 151, సాయితేజ 154, కొలిపాక శ్రీకృష్ణసాయి 190వ ర్యాంకులతో రాణించారు.
UPSC CSE Results | సమాచారం కోసం ప్రత్యేక నంబర్లు
ఫలితాలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే యూపీఎస్సీ upsc counter క్యాంపస్‌లోని పరీక్షా హాల్ వద్ద కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. 2024 సివిల్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు.. తమ పరీక్షలు, నియామకాలకు సంబంధించిన సమాచారం కోసం వర్కింగ్ డేస్‌లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల మధ్య సంప్రదించవచ్చు. అలాగే 23385271, 23381125, 23098543 upsc helpline numbers ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చు.