అక్షరటుడే, న్యూఢిల్లీ: UPI ATM : భారత్‌లో మొట్టమొదటి UPI-ఎనెబుల్డ్ ATMను స్లైస్ బ్యాంక్ (Slice Bank) ప్రారంభించింది.
ఇందులో వినియోగదారులు QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నగదును ఉపసంహరించుకోవచ్చు. డిపాజిట్ కూడా చేయొచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డ్ అవసరం లేదు. ఈ వినూత్న సేవలతో నగదును యాక్సెస్ చేసే విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయి. సంప్రదాయ ATMల సౌలభ్యంతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (Unified Payments Interface – UPI) మిళితం కావడంతో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
క్రెడిట్, డెబిట్ కార్డ్, PIN అవసరమయ్యే సంప్రదాయ ATMల మాదిరిగా కాకుండా.. స్లైస్ బ్యాంక్ UPI ATM పూర్తిగా డిజిటల్ రూపంలో పనిచేస్తుంది.
UPI ATM : పనితీరు ఇలా..
- ATM వద్ద, వినియోగదారులు టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్‌లో “నగదు ఉపసంహరించుకోండి” లేదా “నగదు డిపాజిట్ చేయండి”ని ఎంచుకోవాలి.
- అప్పుడు ATM లావాదేవీ కోసం ఒక ప్రత్యేకమైన QR కోడ్ ప్రత్యక్షమవుతుంది.
- వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా UPI-ఎనేబుల్డ్ యాప్‌ను (స్లైస్, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్) (Slice, PhonePe, Google Pay, Paytm, BHIM) తెరిచి QR కోడ్‌ను స్కాన్ చేయాలి.
- అనంతరం కావలసిన మొత్తాన్ని నమోదు చేసి, UPI పిన్ నమోదు చేయాలి.
- అప్పడు నగదు బయటకు వస్తుంది.
UPI ATM : డిజిటల్ విస్ఫోటనం..
భారతదేశం డిజిటల్ చెల్లింపులలో భారీ వృద్ధిని నమోదు చేస్తున్న సమయంలో స్లైస్ బ్యాంక్ UPI ATM అందుబాటులోకి వచ్చింది. దేశంలో UPI లావాదేవీలు నెలకు 15 బిలియన్లు దాటాయి. అయినా, నగదు రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగంగా ఉంటోంది. ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో నగదు అవసరం ఉంటోంది. ఈ నేపథ్యంలో UPI ATM లకు మంచి ఆదరణ ఉంటుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
UPI ATM : నెల రోజుల్లో అందుబాటులోకి..
రాబోయే నెలల్లో స్లైస్ బ్యాంక్ ప్రధాన నగరాల్లో UPI ATMలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు మాల్స్, రైల్వే స్టేషన్లు, విద్యా ప్రాంగణాల వంటి అధిక ట్రాఫిక్ ఉన్న ప్రదేశాలపై దృష్టి సారిస్తోంది. నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, ఏటీఎం సేవను మరింత మంది వినియోగదారులకు అందించడానికి స్లైస్ బ్యాంక్.. ఇతర ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యాలను సైతం అన్వేషిస్తోంది.