More
    HomeజాతీయంUttar Pradesh | ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భార్య‌.. ఏకంగా ముక్కు కొరికేసిన భ‌ర్త‌

    Uttar Pradesh | ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భార్య‌.. ఏకంగా ముక్కు కొరికేసిన భ‌ర్త‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఈ మ‌ధ్య వివాహేత‌ర సంబంధాల ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. ప్ర‌భుత్వం ఎన్ని క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి కేసులు ఏదో ఒక చోట క‌నిపిస్తూనే ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని హర్దోయ్ జిల్లాలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. తన భార్య ప్రియుడితో ఉండగా చూసిన భర్త తీవ్ర ఆగ్రహంతో ఆమె ముక్కు కొరికేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హర్దోయ్ జిల్లా(Hardoi District) పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళ, అదే గ్రామానికి చెందిన తన ప్రియుడిని కలిసేందుకు వెళ్లింది. ఆమె భర్త రామ్ ఖిలావన్, భార్యను రహస్యంగా అనుసరిస్తూ ప్రియుడి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ తన భార్య ప్రియుడితో ఉండడాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

    READ ALSO  Uttar Pradesh | తుపాకీతో హల్​చల్​ చేసిన యువతి

    Uttar Pradesh | అలా చేశాడేంటి?

    ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా.. మాటామాటా కూడా పెరిగింది. ఈ స‌మ‌యంలో తీవ్ర కోపోద్రిక్తుడైన రామ్ ఖిలావన్, ప్రియుడి ఎదుటే తన భార్య ముక్కును బలంగా కొరిక‌డంతో ఆమె ముక్కుకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. బాధితురాలి ఆర్తనాదాలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న హరియావాన్ పోలీసులు(Haryavan Police) హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్ర రక్తస్రావంతో ఉన్న మహిళను హర్దోయ్ వైద్య కళాశాలకు తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం లక్నోలోని ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.

    ఈ ఘటనపై అదనపు ఎస్పీ నరేంద్ర కుమార్(Additional SP Narendra Kumar) మాట్లాడుతూ “నిందితుడైన భర్త రామ్ ఖిలావన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. అయితే ఇలాంటి వివాహేత‌ర సంబంధాల వ‌ల‌న ప‌చ్చ‌ని జీవితాలు పాడ‌వుతున్నాయి. వీరి వ‌ల‌న పిల్ల‌లు అనాథ‌ల‌వుతున్నారు. ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా కూడా కొంద‌రిలో మార్పు రాక‌పోవ‌డం దారుణం.

    READ ALSO  Plane Crash | అమిత్​ షా కీలక ప్రకటన.. ఆ తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టతన్న కేంద్ర మంత్రి

    Latest articles

    Pune Traffic | పూణే ట్రాఫిక్.. నా ఫ్రెండ్ దుబాయ్ చేరుకున్నా.. నేను ఇంకా ట్రాఫిక్‌లోనే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Pune Traffic | ట్రాఫిక్ ఈ పదం వింటేనే చాలా మందికి చిరాకు వస్తుంది. ముఖ్యంగా ప్రతీ...

    D Srinivas | ఇందూరులో డీఎస్​ విగ్రహం త్వరలో ఆవిష్కరణ

    అక్షరటుడే, ఇందూరు: D Srinivas | దివంగత మాజీ మంత్రి డీ శ్రీనివాస్ (Late former minister D....

    Banakacharla Project | బనకచర్లకు అనుమతులు ఇవ్వొద్దు : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Banakacharla Project | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం(Andhra Pradesh Government) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్​కు అనుమతులు ఇవ్వొద్దని...

    Kasula Balaraj | మున్నూరు కాపుల ఎదుగుదలకు కృషి చేస్తా..

    అక్షరటుడే, బాన్సువాడ: Kasula Balaraj | మున్నూరుకాపుల అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తామని ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ కాసుల...

    More like this