అక్షరటుడే, వెబ్డెస్క్: Hardeep Puri | పహల్గామ్ ఉగ్రవాద దాడి(pahalgam terror attack) తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పాకిస్తాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని( రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర నిర్ణయంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు పడనుంది. వ్యవసాయం ఆధారపడిన ఆదేశానికి చావుదెబ్బగా మారనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన పలువురు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్, మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. ’సింధు నది నీటి ఆపితే.. భారతీయుల రక్తం ప్రవహిస్తుంది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
అయితే, భుట్టో వ్యాఖ్యలకు మన కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ‘నేను అతడి(భుట్టో) ప్రకటన విన్నాను. అతిడిని నీటిలో ఎక్కడైనా దూకమనండి. అసలు నీరే లేనప్పుడు అతను ఎలా చస్తాడు..? అలాంటి వారి ప్రకటనల్ని పట్టించుకోవద్దు. తర్వాత వారికే అర్థం అవుతుంది’ అని అన్నారు.
‘పహల్గామ్లో ఉగ్రదాడి పొరుగు దేశం చేసిందే. దీనికి వారు బాధ్యత వహించాల్సిందే. మునుపటిలా కాదు.. ఇప్పుడు వారి ఆటలు సాగవు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా.. పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రారంభం మాత్రమే’ అని పేర్కొన్నారు.