అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | నగరంలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (Underground drainage) పనులను త్వరగా పూర్తి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా mla dhanpal suryanarayana అధికారులకు సూచించారు. మంగళవారం గంగస్థాన్లో పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అమృత్–2 (Amrit-2) పథకం కింద నగరానికి రూ.400 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ(Underground drainage) పనుల్లో భాగంగా 150 మ్యాన్ హోల్స్ పునర్నిర్మాణం చేసినట్లు, అలాగే 45 కొత్తవి నిర్మించినట్లు పేర్కొన్నారు. ఒక కిలోమీటర్ మేర పైప్లైన్ వేశామని చెప్పారు. అలాగే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. పనులు నెమ్మదిగా కొనసాగడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట డీఈ నగేష్, రెడ్డి, సాయిచంద్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.