అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి రామారెడ్డి(Ramareddy) సమీపంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నుంచి సిద్దిపేట వెళ్లాల్సిన ఓ లారీ పొరపాటున రామారెడ్డి బైపాస్ వంతెన నుంచి సర్వీస్ రోడ్డులోకి దిగింది. వెంటనే తప్పుదారిలో వెళ్తున్నామని గుర్తించిన డ్రైవర్ బైపాస్ పైకి లారీ(Lorry)ని మళ్లించాడు. అదే సమయంలో వెనుక నుంచి హైదరాబాద్(Hyderabad) వైపు వెళ్తున్న లారీ వేగంగా ఈ లారీని ఢీకొట్టింది. దీంతో హైదరాబాద్ వెళ్తున్న వెళ్తున్న లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని మధ్యప్రదేశ్ కు చెందిన ఓంకారం పార్తీ(33) గా గుర్తించారు. గాయపడ్డ మరో ఇద్దరిని ప్రస్తుతం కామారెడ్డి జీజీహెచ్(Kamareddy GGH) కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.