More
    Homeబిజినెస్​2025 TVS Apache RTR 160 | అపాచీ ఆర్‌టీఆర్‌ 160 న్యూ మోడల్‌ బైక్‌ను...

    2025 TVS Apache RTR 160 | అపాచీ ఆర్‌టీఆర్‌ 160 న్యూ మోడల్‌ బైక్‌ను లాంచ్‌ చేసిన టీవీఎస్‌.. డ్యుయల్‌ చానల్‌ ఏబీఎస్‌తో అందుబాటులోకి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: 2025 TVS Apache RTR 160 | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌(TVS Motor).. భారత్‌లో 2025 వెర్షన్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 160ని విడుదల చేసింది. ఈ బైక్‌ను ఓబీడీ-2బీ(OBD-2B) ఉద్గార ప్రమాణాలతో తీసుకువచ్చింది. దీనిని డ్యూయల్‌ చానల్‌ ఏబీఎస్‌(Dual channel ABS) సదుపాయంతో తీసుకురావడం విశేషం. బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ 160, యమహా ఎఫ్‌జడ్‌కు దీనిని తీసుకువచ్చారు. ఈ మోడల్‌ ఎక్స్‌షోరూమ్‌(ex-showroom) ధర రూ. 1.34 లక్షలుగా ఉంది. ఈ బైక్‌ ఫీచర్స్‌ తెలుసుకుందామా..

    17 inch అల్లాయ్‌ వీల్స్‌తో ఈ బైక్‌ లభించనుంది. స్పోర్టీ బాడీ డిజైన్‌(Sporty body design)తో సింగిల్‌ పీస్‌ సీట్‌ ఇచ్చారు. స్పోర్ట్‌, అర్బన్‌, రెయిన్‌ అనే మూడు రైడిరగ్‌ మోడ్‌లు ఉన్నాయి. ఇది పూర్తి డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో వస్తోంది. బ్లూటూత్‌ ద్వారా టీవీఎస్‌ యాప్‌నకు కనెక్ట్‌ అవ్వొచ్చు. టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌, కాల్‌, ఎస్సెమ్మెస్‌ అలర్ట్‌లు లభిస్తాయి.

    READ ALSO  Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    ఇందులో 159.7 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌ కూల్డ్‌ BS6/Phase 2 ఇంజిన్‌ అమర్చారు. ఇది 15 హెచ్‌పీ పవర్‌ను, 13.85 Nm @ 7,000 RPM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఉంది. టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్‌తో పాటు, వెనుకవైపు డ్యూయల్‌ షాక్‌ అబ్జార్బర్స్‌తో వస్తోంది. 12 లీటర్ల ఫ్యుయల్‌(Fuel) ట్యాంకర్‌ కలిగిన ఈ మోడల్‌ బైక్‌ బరువు 137 కిలోలు.

    2025 TVS Apache RTR 160 | ఏబీఎస్‌ బ్రేక్ టెక్నాలజీ ఎందుకంటే..

    ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో తయారవుతున్న అన్ని టూవీలర్లకు ఏబీఎస్ బ్రేక్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని నిర్దేశించింది. దీంతో 125CC కంటే తక్కువ మోడల్ బైక్స్ కూడా మరింత రక్షణను పొందనున్నాయి. ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి రాబోతోంది.
    అసలు ABS అంటే (A͏nti lock Br͏aking S͏ystem). ఇది ఆధునిక వాహనాలలో కీలకమైన భద్రతా లక్షణం. వాహనాల్లో ఒక భద్రత వ్యవస్థగా ఉపయోగిస్తారు. సడన్‌గా ‍బ్రేక్‌ వేసిన సమయంలో చక్రాలు లాక్ అవ్వకుండా ఇది నిరోధిస్తుంది. దీనివల్ల వాహనం నడిపే వ్యక్తికి వాహనం మీద నియంత్రణ ఉంటుంది. వాహనం స్కిడ్‌(Skid) కాకుండా చూస్తుంది. తడిగా ఉండే రోడ్లపై లేదా అత్యవసర పరిస్థితుల్లో వాహనం సురక్షితంగా ఆగుతుంది.

    READ ALSO  Stock Market | తొలగిన యుద్ధ భయం.. భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు..

    ఏబీఎస్‌ ఇప్పటివరకు 150 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యం కలిగిన వాహనాలకు మాత్రమే అమలవుతోంది. అంటే స్పోర్ట్ బైక్స్, మిడ్ రేంజ్ బైక్స్ వంటి మోడళ్లలో ఈ ‍బ్రేక్‌ సిస్టమ్‌(Break system) ఉంది. అన్ని టూవీలర్లకూ దీన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ విధానం అమలు చేయడం వల్ల బైక్‌ల తయారీ వ్యయం పెరుగుతుంది. ఆ భారాన్ని కంపెనీలు వినియోగదారులపై వేసే అవకాశాలుంటాయి. దీనివల్ల ఎంట్రీ లెవల్‌ టూవీలర్‌(Two wheeler) మోడళ్ల ధరలు రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు పెరగవచ్చని భావిస్తున్నారు.

    Latest articles

    CP Sai Chaitanya | పోలీసుల దిగ్బంధంలో ఇందూరు

    అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా (Union Home...

    IPS officer Parag Jain | రా చీఫ్ గా పరాగ్ జైన్..నిఘాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPS officer Parag Jain | భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ ఏ...

    Police transfers | రాష్ట్రంలో 44 మంది డీఎస్పీల బదిలీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Police transfers | తెలంగాణ రాష్ట్రంలో ఏసీపీలు, డీఎస్పీలు బదిలీ (ACPs and DSPs transfers)...

    Vice President Dhankhar | ప్ర‌వేశిక‌ను మార్చ‌లేము కానీ.. 1976లోనే మార్చార‌ని గుర్తు చేసిన ధ‌న్‌ఖ‌డ్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Vice President Dhankhar | రాజ్యాంగ ప్ర‌వేశిక మార్పుపై వివాదం నెల‌కొన్న త‌రుణంలో ఉప రాష్ట్ర‌ప‌తి...

    More like this

    CP Sai Chaitanya | పోలీసుల దిగ్బంధంలో ఇందూరు

    అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | జిల్లా కేంద్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా (Union Home...

    IPS officer Parag Jain | రా చీఫ్ గా పరాగ్ జైన్..నిఘాను బలోపేతం చేయడంలో కీలక పాత్ర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :IPS officer Parag Jain | భారత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ ఏ...

    Police transfers | రాష్ట్రంలో 44 మంది డీఎస్పీల బదిలీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Police transfers | తెలంగాణ రాష్ట్రంలో ఏసీపీలు, డీఎస్పీలు బదిలీ (ACPs and DSPs transfers)...