అక్షరటుడే, వెబ్డెస్క్ : TTD | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు రాష్ట్రంలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంతేగాకుండా పలు జిల్లాల్లో ఆలయాలు, కల్యాణ మండపాలు నిర్మించి భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. దీంతో పాటు పలు ప్రత్యేక కోర్సుల్లో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తోంది. ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించడంతో పాటు భవిష్యత్ తరాలకు అందించేందుకు టీటీడీ కృషి చేస్తోంది.
టీటీడీ ttd శ్రీవేంకటేశ్వర sri venkateswara సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ ద్వారా పలు కోర్సుల్లో courses ఉచిత శిక్షణ ఇస్తోంది. ఈ సంస్థ ఆలయ నిర్మాణ శిల్పకళ, వాస్తుశిల్పం, ఇతర సంబంధిత కళా రూపాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. దీనిని 1960లో స్థాపించారు. నాటి నుంచి ఎంతోమంది ఇక్కడ శిక్షణ పొంది ఉన్నత శిఖరాలు చేరుకున్నారు.
TTD | కోర్సుల వివరాలు..
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సంస్థ నాలుగేళ్ల కాలపరిమితితో ఆరు అంశాల్లో శిక్షణనిస్తోంది. ఆలయ నిర్మాణ విభాగం, శిలా శిల్ప విభాగం, సుధా శిల్ప విభాగం, లోహ శిల్ప విభాగం, కొయ్య శిల్ప విభాగం, సంప్రదాయ వర్ణచిత్ర లేఖన విభాగాల్లో ట్రెయినింగ్ ఇస్తోంది. ఏటా ఒక్కొక్క విభాగంలో పది మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇందులో ప్రవేశం పొందిన వారికి శిక్షణతో పాటు ఉచిత వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు.