అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను ఏర్పాటు చేసింది. మంగళవారం దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (Tirumala Tirupati Devasthanams Board) ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు Chairman B.R. Naidu, ఈవో శ్యామలరావు EO Shyamala Rao ప్రారంభించారు.
Tirumala : ప్రయోజనం ఏమిటంటే..
స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేది. ఇకపై ఆ సమస్య ఉండదు. తిరుమలలోనే అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించగలిగే విధంగా పరిశోధనశాలను తీర్చిదిద్దారు.
Tirumala : కల్తీ నెయ్యి వ్యవహారంతో..
తిరుమలలో నెయ్యి నాణ్యతను పరీక్షించే వసతి లేదని ఇప్పటివరకు లేదు. కాగా, గతంలో కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూడటంతో.. తాజాగా స్థానికంగానే నెయ్యి నాణ్యతను పరీక్షించే ఏర్పాట్లను చేశారు.
నెయ్యిలో నాణ్యత శాతం, కల్తీ శాతాన్ని వెంటనే విశ్లేషించే HPLC (High Performance Liquid Chromatograph), GC (Gas Chromatograph) యంత్రాలు ఏర్పాటు చేశారు. ఈ యంత్రం విలువ రూ.75 లక్షల వరకు ఉంటుంది. దీనిని గుజరాత్ (Gujarat) కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (National Dairy Development Board – NDDB) విరాళంగా అందజేసింది.
Tirumala : మైసూర్లో ప్రత్యేక శిక్షణ..
ఆహార నాణ్యత పరిశీలనలో పాలుపంచుకునే సిబ్బంది, పోటు కార్మికులకు మైసూర్ (Mysore) లోని CFTRIలో ప్రత్యేక శిక్షణ అందించారు. ఆహార నాణ్యత పరిశోధనశాల ప్రారంభ వేడుకలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, సదాశివరావు, నరేష్, సీఈ సత్య నారాయణ, డిప్యూటీ ఈవోలు సోమన్నారాయణ, భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.