అక్షరటుడే, వెబ్‌డెస్క్: Donald Trump | అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్‌పై Jerome Powell, Chairman of the US Federal Reserve, the central bank ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. వడ్డీ రేట్లలో Interest rates మరింత కోతలు అవసరమని పేర్కొన్నారు. అన్ని ధరలూ తగ్గుతున్నా ద్రవ్యోల్బణం Inflation వాస్తవంగా లేదని పరోక్షంగా పావెల్‌ను ఉద్దేశించి విమర్శించారు.
ఇటీవల గుడ్డు ధర తగ్గుదల ద్వారా ఇంధన ఖర్చులు, ఆహార ధరలు గణనీయంగా తగ్గుతున్నందున ద్రవ్యోల్బణం వాస్తవంగా ఉనికిలో లేదని ట్రంప్ తెలిపారు. “చాలా మంది వడ్డీ రేట్లలో “ముందస్తు కోతలు” Early cuttings కోరుతున్నారు. ఇంధన ఖర్చులు బాగా తగ్గడంతో, ఆహార ధరలు గణనీయంగా తగ్గాయి. చాలా ఇతర “విషయాలు” తగ్గుతున్నందున, ద్రవ్యోల్బణం వాస్తవంగా లేదు,” అని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Donald Trump | రేట్ల కోతలో ఆలస్యం
వడ్డీ రేట్లు తగ్గించడంలో పావెల్ ఆలస్యం చేశారని ట్రంప్ విమర్శించారు. యూరప్ Europe ఏడుసార్లు రేట్లను తగ్గించిందని, పావెల్ చర్య తీసుకోవడంలో “చాలా ఆలస్యం” చేశారని ట్రంప్ పేర్కొన్నారు. “పావెల్ ఎల్లప్పుడూ “చాలా ఆలస్యం”గానే ఉన్నాడు, ఎన్నికల కాలంలో జో బైడెన్, తరువాత కమల ఎన్నిక అధ్యక్షురాలిగా ఎన్నిక కావడానికి మాత్రమే తగ్గించారు. అప్పుడు ద్రవ్యోల్బణం ఎలా ఉండింది? ” అని ప్రశ్నించారు. అమెరికాAmericaలో పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి మధ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ మధ్య కొనసాగుతున్న తలెత్తిన ఘర్షణ కొనసాగుతోంది.
ట్రంప్ దూకుడు సుంకాల విధానాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయడంతో పాటు వైట్ హౌస్ White House, ఫెడరల్ రిజర్వ్ Federal Reserve మధ్య విభేదాలు పొడసూపాయి. ట్రంప్ 90 రోజుల సుంకాన్ని జారీ చేసినప్పటికీ, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణాన్ని పెంచడం, వృద్ధి మందగించడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తాయని పావెల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిగా, ట్రంప్ పావెల్ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయనను తన పదవి నుండి తొలగించాలని కూడా సూచించారు.