అక్షరటుడే, వెబ్‌డెస్క్: One Beautiful Bill | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పంతం నెగ్గించుకున్నారు. తన కలల బిల్లు ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పై సంతకం చేశారు. జూలై 4న ఇండిపెండెన్స్ డే సందర్భంగా వైట్‌హౌస్(White House)లో జరిగిన వేడుకల్లో ఈ బిలును ఆయన అధికారికంగా చట్టంగా మార్చారు.
పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణ కోసం తీసుకొచ్చిన ఈ బిల్లుపై విమర్శలు వెల్లువెత్తినా ట్రంప్ లెక్కచేయకుండా ముందుకే సాగారు. బిల్లుపై సంతకం చేసిన సందర్భంగా ప్రసంగించిన ట్రంప్.. బిల్లుపై దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేయడం ఇంతకు ముందెన్నడూ చూడలేదని చెప్పారు. పన్నుల భారాన్ని తగ్గించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. “దేశంలో ప్రజలంతా ఇంత హర్షాతిరేకంగా ఉన్న దృశ్యం నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఈ బిలుతో అన్ని వర్గాలకు రక్షణ లభించనుంది” అని పేర్కొన్నారు.
One Beautiful Bill | పన్ను తగ్గింపులు..
బ్యూటీఫుల్ బిల్లు (One Beautiful Bill)ను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సహా ఎంతో మంది వ్యతిరేకించినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. పట్టుబట్టి మరీ దాన్ని ఆమోదింపజేసుకున్నారు. ఇప్పుడు సంతకం చేయడం ద్వారా దాన్ని చట్టంగా మార్చారు. ట్యాక్స్ కట్స్‌తో పాటు ప్రభుత్వం వ్యయ నియంత్రణపై కూడా దృష్టి పెట్టింది. అనవసరమైన ఖర్చులను తగ్గిస్తూ, ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడమే లక్ష్యంగా బిల్లు రూపొందించబడింది. ఈ బిల్లో ప్రధానంగా పన్ను తగ్గింపులకు పెద్దపీట వేశారు. మధ్యతరగతి ప్రజలు, చిరు వ్యాపారులు దీనివల్ల స్వల్పకాలికంగా అయినా ఊపిరి పీల్చుకునే అవకాశం పొందనున్నారు. ఈ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థలో తాత్కాలిక ఊతాన్ని కలిగించేలా రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. పన్నుల భారం తగ్గించడమే కాకుండా, పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఇది దోహదం చేస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
One Beautiful Bill | అందరికీ లబ్ధి..
ప్రజలెప్పుడూ ఇంత సంతోషంగా ఉన్నట్లు గతంలో తానెప్పుడూ చూడలేదని ట్రంప్ అన్నారు. పన్ను మినహాయింపులు, వ్యయ నియంత్రణలతో కూడిన ప్రధాన ప్యాకేజీపై సంతకం చేసిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ చట్టంతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. సాయుధ బలగాల నుంచి మొదలు రోజువారీ కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతునిస్తుందని చెప్పారు. అమెరికా (America) చరిత్రలోనే తన ప్రభుత్వం అతిపెద్ద పన్నుల కోత, వ్యయ కోత, సరిహద్దు భద్రతలో అతిపెద్ద విజయం సాధించిందన్నారు. ఈ బిల్లును ఆమోదించడంలో కీలకంగా వ్యవహరించిన స్పీకర్, రిపబ్లికన్ చట్టసభ సభ్యులకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు కారణంగా “మన దేశం ఆర్థికంగా రాకెట్ షిప్‌గా మారబోతోంది” అని అన్నారు. అమెరికా గెలిచిందన్న ట్రంప్.. తాము చేసిన వాగ్దానాలను నిలబెట్టుకున్నామని చెప్పారు.