అక్షరటుడే, వెబ్‌డెస్క్: Travel Food Services | క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల(QSR)తోపాటు విమానాశ్రయాల్లో లాంజ్‌లను నిర్వహించే ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ (Travel Food Services) కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్ సోమవారం ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లకు గ్రేమార్కెట్ ప్రీమియం(GMP) 4 శాతంగా ఉంది.
ముంబయికి చెందిన ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ కంపెనీ 2009లో తొలి ట్రావెల్ క్యూఎస్‌ఆర్‌ను ప్రవేశపెట్టింది. కపూర్ ఫ్యామిలీ ట్రస్ట్‌తోపాటు ఎస్‌ఎస్‌పీ గ్రూప్ పీఎల్‌సీ కంపెనీని ప్రమోట్ చేశాయి. ఈ కంపెనీ ప్రధానంగా కొన్ని విమానాశ్రయాలు(Airports), జాతీయ రహదారి ప్రాంతాలలో ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ఎంపిక చేసిన ఆహారం, పానీయాల(ఎఫ్‌అండ్‌బీ)ను సమకూరుస్తోంది.
దేశీయంగా 14 విమానాశ్రయాలలో సర్వీసులు, మలేసియాలో 3 ఎయిర్‌పోర్టులలో లాంజ్ సేవలు అందిస్తోంది. గతేడాది జూన్ 30 నాటికి దేశ, విదేశాలలో 117 పార్ట్‌నర్, సొంత బ్రాండ్లతో కలిపి 397 ట్రావెల్ క్యూఎస్‌ఆర్(QSR) ఔట్‌లెట్లను నిర్వహిస్తున్నట్లు ఆర్‌హెచ్‌పీలో పేర్కొంది. సాధారణంగా మొదటి, వ్యాపార తరగతి ప్రయాణికులు, ఎయిర్‌లైన్ రివార్డ్ ప్రోగ్రామ్‌ల సభ్యులకు, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ హోల్డర్లు, ఇతర లాయల్టీ ప్రోగ్రామ్‌లలో ఉన్నవారికి ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఈ ఐపీవో(IPO) పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్ కపూర్ ఫ్యామిలీ ట్రస్ట్ రూ. 2వేల కోట్ల విలువైన ఈక్విటీని విక్రయించనుంది.
Travel Food Services | కంపెనీ పనితీరు..
కొన్నేళ్లుగా ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ బలమైన ఆర్థిక పనితీరును ప్రదర్శిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం(Revenue) గత సంవత్సరంతో పోలిస్తే 20.9 శాతం పెరిగి రూ. 1,762.71 కోట్లకు చేరింది. లాభాలు 27.4 శాతం పెరిగి రూ. 379.66 కోట్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2023-24)లో రెవెన్యూ రూ. 1,462 కోట్లు, లాభాలు(Profit) రూ. 298.02 కోట్లుగా ఉన్నాయి.
Travel Food Services | ముఖ్యమైన తేదీలు..
ఈ కంపెనీ ఐపీవో సబ్‌స్క్రిప్షన్(Subscription) సోమవారం ప్రారంభం కానుంది. 9వ తేదీన ముగుస్తుంది. 10వ తేదీన అలాట్‌మెంట్ స్టేటస్ వెలువడే అవకాశాలున్నాయి. 14న బీఎస్‌ఈతోపాటు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు లిస్టవుతాయి.
Travel Food Services | ధరల శ్రేణి..
కంపెనీ ధరల శ్రేణి(Price band)ని రూ. 1,045 నుంచి రూ. 1,100గా ప్రకటించింది.
Travel Food Services | లాట్ సైజ్..
ఒక లాట్‌లో 13 ఈక్విటీ షేర్లున్నాయి. ఒక లాట్ కోసం రూ. 14,300 తో బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 13 బిడ్లు వేయవచ్చు.
Travel Food Services | కోటా, జీఎంపీ..
క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐ(NII)లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 45 గా ఉంది. అంటే లిస్టింగ్ రోజు 4 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.