అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kondapur Flyover | హైదరాబాద్ (Hyderabad city traffic) మహా నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రం అవుతోంది.
హైదరాబాద్ నగర జనాభా పెరుగుతుండటంతో ప్రజలు గంటల కొద్ది ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంటున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు కొలువై ఉన్న గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొండాపూర్–గచ్చిబౌలి మార్గంలో ఫ్లై ఓవర్‌ను నిర్మించింది. దీనిని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) జూన్ 28న ప్రారంభించనున్నారు.
Kondapur Flyover | సీఎం చేతులమీదుగా ప్రారంభం
గచ్చిబౌలి- కొండాపూర్ ఫ్లై ఓవర్ (Gachibowli-Kondapur Flyover)ను రూ.172 కోట్లతో 1.2 కిలోమీటర్ల మేర నిర్మించారు. దీనికి మాజీ మంత్రి పీ జనార్దన్ రెడ్డి (PJR) పేరు పెట్టారు. ఈ ఫ్లై ఓవర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఈ నెల 28న ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా.. ఇక్కడ త్రీ లెవెల్ ఫ్లై ఓవర్లను ప్రభుత్వం నిర్మించింది. మొదటి దశలో గచ్చిబౌలి జంక్షన్ ఫ్లై ఓవర్ నిర్మించారు. లెవల్ –2లో శిల్పా లేఔట్ ఫేజ్–1 ఫ్లై ఓవర్ నిర్మించారు. ఈ రెండు ఫ్లై ఓవర్లు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం చేయడానికి మూడో దశలో 1.2 కిలోమీటర్ల మేర మరో ఫ్లై ఓవర్ నిర్మించారు. దీంతో గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్, హైటెక్ సిటీ వెళ్లడానికి సమయం ఆదా కానుంది.