ePaper
More
    HomeతెలంగాణBogatha Water Falls | బొగ‌త‌కి జలకళ, పోటెత్తిన ప‌ర్యాట‌కులు.. తెలంగాణ న‌యాగ‌రా వ‌ద్ద...

    Bogatha Water Falls | బొగ‌త‌కి జలకళ, పోటెత్తిన ప‌ర్యాట‌కులు.. తెలంగాణ న‌యాగ‌రా వ‌ద్ద సంద‌డే సంద‌డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Bogatha Water Falls | స‌మ్మ‌ర్‌లో పిల్ల‌ల‌కి సెల‌వులు కాబ‌ట్టి మంచి ప్రాంతానికి వెకేష‌న్ వెళ్లాల‌నే ప్లాన్స్ చేస్తుంటారు. అయితే ఈ సారి తొంద‌ర‌గానే రుతుప‌వ‌నాలు రావ‌డం, భారీ వ‌ర్షాలు(Heavy Rains) కురుస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ న‌యాగ‌రా బొగ‌త‌కి (Bogatha water falls) ప‌ర్యాట‌కులు పోటెత్తుతున్నారు. నైరుతి రుతుపవనాల ప్ర‌భావంతో అట‌వీ ప్రాంతంలో కురుస్తున్న వ‌ర్షాల‌తో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాజేడు మండలంలో ఉన్న బొగత జ‌ల‌పాతం (తెలంగాణ నయాగరా ఫాల్స్)కి కూడా జ‌ల‌క‌ళ సంత‌రించుకుంది.

    Bogatha Water Falls | చూసి తీరాల్సిందే..

    అయితే ఈ అందాల‌ని చూసేందుకు దూర ప్రాంతాల నుండి పర్యాట‌కులు (Tourists) పోటెత్తుతున్నారు. ఈ జలపాతం సుమారు 30అడుగుల ఎత్తు నుంచి పలు సమాంతర పాయలలో కిందికి నీరు పడుతూ, దిగువన పెద్ద నీటి కొలను కనువిందు చేస్తుంది. పాల నురుగులా జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. కొండల నుంచి పరుగున వస్తున్న జల సవ్వడిని చూసి తన్మయత్వంలో మునిగిపోతున్నారు. తెలంగాణ నుండే కాక ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కూడా సందర్శకులు వచ్చి ఈ అందాల‌ని ఆస్వాదిస్తుంటారు.

    READ ALSO  Weather Updates | రైతులకు శుభవార్త.. ఆరు రోజుల పాటు భారీ వర్షాలు..

    వర్షాకాలం వ‌స్తే తెలుగు రాష్ట్రాల ప్రజలు బొగత జలపాతానికి (Bogatha Falls) వెళ్లాలి అనుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద జలపాతాల్లో ఇది ఒకటి. దీని సందర్శనకు తెలంగాణ ప్రభుత్వం (Telangana government) అనుమతి ఇచ్చింది కాబ‌ట్టి ఈ జలపాతానికి వెళ్లొచ్చు. ఈ జలపాతం ములుగు జిల్లా(Mulugu District)లోని వాజేడు మండలంలో ఉంది.

    ప్రస్తుతం ఈ జలపాతంలో జల ధార బాగా ఉంది. దీన్ని చూడటానికి ఇప్పటి నుంచి వెళ్తే చాలా బాగుంటుంది. సొంత వాహనాల్లో వెళ్లేవారు.. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వెళ్లొచ్చు. బస్సులో వెళ్లేవారు MGBS నుంచి డైరెక్టుగా ఏటూరు నాగారంకి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో వెళ్లొచ్చు. లేదా.. హన్మకొండకు (Hanmakonda)వెళ్లి.. అక్కడి నుంచి ఏటూరు నాగారం వెళ్లే బస్సు ఎక్కొచ్చు. ఇక అక్క‌డికి వెళ్లాక వాచ్ టవర్స్ ఎక్కితే చుట్టూ ప్రకృతి అందాలు, జలసవ్వడులు మనసును దోచుకుంటాయి.

    READ ALSO  Banakacharla Project | బ‌న‌క‌చ‌ర్ల‌పై చ‌ర్చే వ‌ద్దు.. కేంద్రానికి తెలంగాణ లేఖ‌

    Latest articles

    Nizamsagar | క్లిష్ట పరిస్థితుల్లో 108 అంబులెన్స్​లో ప్రసవం

    అక్షరటుడే, నిజాంసాగర్:Nizamsagar | పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని 108లో తరలిస్తుండగా నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్​లోనే డెలివరీ(Ambulance Delivery)...

    Governor Jishnu Dev Verma | పీహెచ్​డీ, గోల్డ్​ మెడలిస్ట్​లకు పట్టాలను ప్రదానం చేసిన గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ

    అక్షరటుడే, డిచ్​పల్లి: Governor Jishnu Dev Verma | తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) పీహెచ్​డీ, గోల్డ్​ మెడలిస్ట్​లకు...

    Tirumala | తిరుమల ఘాట్​రోడ్డులో లోయలో దూకిన వ్యక్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tirumala | తిరుమల (Tirumala) ఘాట్​ రోడ్డులో ఓ వ్యక్తి లోయలోకి దూకడం తీవ్ర కలకలం...

    Minister Sridharbabu | ఒక్క చుక్క నీటిని వ‌దులుకోం.. మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు స్ప‌ష్టీక‌ర‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Sridharbabu | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం (Andhra Pradesh Government) నిర్మించ‌త‌ల‌పెట్టిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విషయంలో...

    More like this