అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Bharat Bandh | కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు బుధవారం భారత్ బంద్(Bharat Bandh)కు పిలుపునిచ్చాయి. దాదాపు 25 కోట్లకు పైగా కార్మికులు ఈ బంద్‌లో పాల్గొనున్నారు. దీంతో కీలక రంగాల్లో సేవలకు అంతరాయం కలుగనుంది. జూలై 9ర దేశవ్యాప్తంగా సమ్మెకు 10 కేంద్ర కార్మిక సంఘాల(Central Trade Unions) ఉమ్మడి వేదిక పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమంలోచేరడానికి అధికారిక, అనధికారిక రంగాలకు చెందిన 25 కోట్లకు పైగా కార్మికులు సిద్ధమవుతున్నారు. కార్మికులు చేపట్టిన ఈ నిరసనతో బ్యాంకింగ్, బీమా, రవాణా, విద్యుత్, పోస్టల్ కార్యకలాపాలతో సహా ముఖ్యమైన సేవలకు అంతరాయం కలిగిస్తుందని భావిస్తున్నారు.
Bharat Bandh | ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ..
ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు, కార్పొరేట్ అనుకూల విధానాలకు నిరసనగా సమ్మె చేపడుతున్నట్లు ఉమ్మడి ట్రేడ్ యూనియన్ ఫోరం(Trade Union Forum) వెల్లడిచింది. ప్రధానంగా నాలుగు కొత్త కార్మిక కోడ్‌ల అమలు, ప్రభుత్వ రంగ యూనిట్లు, ముఖ్యమైన సేవల ప్రైవేటీకరణ, శాశ్వత ఉద్యోగాల అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టలైజేషన్,యూనియన్ కార్యకలాపాలను బలహీనపరచడం వంటి వాటిని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. గతంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ(Union Ministry of Labour) ముందు 17 పాయింట్ల డిమాండ్లను ఉంచగా, పెద్దగా ఫలితం లేకపోయింది. దీంతో సమ్మెకు సిద్ధమయ్యారు.
Bharat Bandh | ప్రధాన యూనియన్ల ఆధ్వర్యంలో..
భారత్ బంద్‌లో దాదాపు అన్ని ప్రధాన యూనియన్లు పాల్గొంటున్నాయి. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, హింద్ మజ్దూర్ సభ వంటి ప్రధాన యూనియన్ల నాయకులు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. నిర్మాణ, మైనింగ్, రవాణా, తయారీ, బ్యాంకింగ్, బీమా, వ్యవసాయ రంగాలలో ఉన్న 25 కోట్లకు పైగా కార్మికులు బంద్‌లో పాల్గొంటారని ఏఐటీయూసీ నేత అమర్‌జీత్ కౌర్(AITUC Leader Amarjeet Kaur) చెప్పారు. 27 లక్షల మంది విద్యుత్ కార్మికులు బంద్‌కు మద్దతు ప్రకటించారు. బ్యాంకింగ్, బీమా సిబ్బంది దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. పోస్టల్ ఉద్యోగులు(Postal Employees), ప్రజా రవాణా సిబ్బంది కూడా విధులు బహిష్కరించనున్నారు.
Bharat Bandh | బ్యాంకు సేవలకు అంతరాయం..
భారత్ బంద్ నేపథ్యంలో కీలక సేవలకు అంతరాయం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ(Government), సహకార బ్యాంకులు(Co Operative Banks) నిలిచి పోతాయని చెబుతున్నారు. బీమా సేవలు, పోస్టల్ డెలివరీలు నిలిచి పోనున్నాయి. సంఘటిత రంగాలలో బొగ్గు తవ్వకాలు, పారిశ్రామిక ఉత్పత్తికి అంతరాయం కలుగనుంది. అయితే, విద్యాసంస్థలు యాథవిధిగానే పని చేయనున్నాయి. ప్రైవేట్ కార్యాలయాలు పని చేస్తాయి. అత్యవసర సేవలను బంద్ నుంచి మినహాయించారు.
Read all the Latest News on Aksharatoday.in