అక్షరటుడే, వెబ్‌డెస్క్: Toll Tax | జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తే వాహనదారులు టోల్ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆయా హైవేలపై అనేక టోల్గేట్లు(Toll Gates) ఉన్నాయి. దీంతో వాహనదారులు టోల్‌ఛార్జీల భారంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తక్కువ టోల్ఛార్జీలు అయ్యే మార్గాలను సూచించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్తగా యాప్ తీసుకొచ్చింది. దీంతో వాహనదారుల టోల్ భారం కొంత మేర తగ్గే అవకాశం ఉంది.
ఎన్హెచ్ఏఐ రాజ్‌మార్గ్ యాత్రా యాప్(NHAI Rajmarg Yatra App)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ఇన్స్టాల్ చేసుకుంటే మనం వెళ్లే మార్గంలో తక్కువ టోల్ ఛార్జీలు(Toll charges) అయ్యే మార్గాన్ని సూచిస్తుంది. ఈ యాప్ జూలై నుంచి అందుబాటులోకి రానుంది. నగరాలకు వెళ్లడానికి.. అనేక మార్గాలు ఉంటాయి. అయితే అందులో ఏ మార్గంలో వెళ్తే తక్కువ టోల్ఛార్జీ అవుతుందో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. 2023లో రూపొందించిన హైవే యాత్ర యాప్(Highway Yatra App) జాతీయ రహదారుల వెంట వివిధ సౌకర్యాల గురించి సమాచారాన్ని అందిస్తోంది. తాజాగా రూపొందించిన యాప్ రెండు ప్రదేశాల మధ్య వేర్వేరు మార్గాల్లో వర్తించే టోల్ టాక్స్(Toll Tax)ల గురించి వివరాలను వాహనదారులకు తెలియజేస్తుంది.
Toll Tax | ఎన్హెచ్ఏఐ ప్రత్యేక చర్యలు
ప్రస్తుతం జాతీయరహదారులపై ఎక్కువగా ప్రయాణాలు చేసే వారు టోల్ ఛార్జీలతో అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో వాహనదారుల సౌలభ్యం కోసం ఎన్హెచ్ఏఐ అనేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఫాస్టాగ్ విధానం తీసుకు రావడంతో వాహనదారుల సమయం ఆదా అవుతుంది. ఇటీవల NHAI ఫాస్ట్‌ట్యాగ్(Fastag) ఏడాది పాస్‌ను విడుదల చేసింది. రూ. 3,000 ధరతో ఈ పాస్ తీసుకుంటే ఏ జాతీయ రహదారిపై అయినా.. 200సార్లు టోల్ ఫీ లేకుండా తిరగొచ్చు. వార్షిక పాస్ కోసం NHAI వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.