అక్షరటుడే, ఇందూరు: Giriraj College | విద్యార్థులు పరిశోధన అంశాలపై అవగాహన పెంపొందించుకుంటే ఉన్నత విద్యలో ఎంతో ఉపయోగపడుతుందని గిరిరాజ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ‘విద్యా రచనలు, ప్రాజెక్టు నివేదికలు’ (Academic writings, project reports) అనే అంశంపై గురువారం కళాశాలలో ఒకరోజు కార్యాశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కేవలం అవగాహన కల్పించుకోవడమే కాకుండా మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ జాన్ సుకుమార్ పరిశోధనా పద్ధతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PowerPoint presentation) ఇచ్చారు. ఈ సందర్భంగా జాన్ సుకుమార్, శ్యాంకుమార్ను కళాశాల తరపున సన్మానించారు.
కార్యక్రమంలో డాక్టర్ శ్యాం కుమార్, డాక్టర్ గంగాధర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ దండు స్వామి, వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, ఐక్యూ ఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, ఎన్సీసీ (NCC) అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, గ్రంథపాలకులు పూర్ణచంద్రరావు, సీనియర్ అసిస్టెంట్ ఉదయభాస్కర్, అధ్యాపకులు ప్రతిభ, నాగజ్యోతి, లావణ్య, రాజశేఖర్, దస్తప్ప, నికత్ ఫాతిమా, వసంత్ జాదవ్, స్థిత ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.