అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | జమ్మూకశ్మీర్లో jammu kashmir పర్యాటకులపై ఉగ్రదాడి terror attack నేపథ్యంలో తిరుమల tirumalaలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో టీటీడీ ttd security యంత్రాంగం అలర్ట్ alert అయింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో alipiri check post పాటు ఘాట్ రోడ్లలోను పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతి ఇస్తున్నారు.
తిరుమలలోని శ్రీవారి ఆలయ srivari temple పరిసరాల్లోనూ భద్రతను security పెంచారు. అనుమానితులను విచారిస్తూ, వారి వివరాలను ఆరా తీస్తున్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడిలో pahalgam terror attack 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. దేశంలోని ఇతర ప్రాంతాల్లో సైతం ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో తిరుమలలో సైతం అధికారులు అప్రమత్తం అయ్యారు.