అక్షరటుడే, కామారెడ్డి: Sub stations | జిల్లాకు మూడు సబ్స్టేషన్లు మంజూరయ్యాయని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం విలేకరులకు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా మెరుగైన విద్యుత్ సరఫరాకు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తాడ్వాయి మండలం చిట్యాల, నిజాంసాగర్(Nizamsagar) మండలం మహమ్మద్ నగర్(Mohammed Nagar), బాన్సువాడ (Banswada) మండలం బొర్లం(Borlam) గ్రామాల్లో నూతన సబ్ స్టేషన్లు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో చిట్యాల(Chityala), మహమ్మద్ నగర్ సబ్ స్టేషన్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. బోర్లం సబ్ స్టేషన్ టెండర్ ప్రాసెస్‌లో ఉందన్నారు.
Sub stations | డిమాండ్‌కు తగ్గట్టుగా..
డిమాండ్‌కు అనుగుణంగా అవసరం మేరకు కొత్తగా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో ఎటువంటి లోవోల్టేజ్ సమస్య ఉండదని ఎస్ఈ పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి అనుగుణంగా కొత్తసబ్ స్టేషన్ల రాకతో రైతులకు, వినియోగదారులకు అంతరాయాలు తగ్గుతాయని స్పష్టం చేశారు. పొడవాటి ఫీడర్లు(Feeders) ఉండవని, ఫీడర్ నష్టాలు తగ్గుతాయని తెలిపారు. ఉన్న సబ్ స్టేషన్లపై లోడ్ భారం తగ్గుతుందని, తద్వారా మెరుగైన, నిరంతరాయ సరఫరా అందించగలుగుతామని చెప్పారు.
Sub stations | త్వరితగతిన వ్యవసాయ కనెక్షన్లు..
నిరంతరం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి, ఈ నూతన సబ్ స్టేషన్లు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయని ఎస్ఈ తెలిపారు. నూతన సబ్ స్టేషన్ల వల్ల నూతన వ్యవసాయ కనెక్షన్లు త్వరితగతిన మంజూరయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సాగు, గృహ, వాణిజ్య అవసరాల కోసం, వినియోగదారులకు ఆర్థికంగా పరిపుష్టం కావడానికి కొత్త సబ్ స్టేషన్లు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలిపారు. ఇందులో ఎస్సీఏడీఏ (SCADA) అనుసంధానం వంటి ఆధునిక సాంకేతికతను అమలు చేయడం జరుగుతుందని, రియల్ టైం ఫీడర్ మానిటర్ ఉంటుందని, విద్యుత్ సంబంధిత పూర్తి సమాచారం తెలుసుకునే వీలుంటుందని చెప్పారు.
Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook‘