అక్షరటుడే, వెబ్‌డెస్క్:Navipet Police | వృద్ధురాలి కంట్లో కారం కొట్టి ఆమె మెడలోని బంగారు గొలుసు చోరీ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్(North Rural CI Srinivas) తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. నవీపేట్ మండలం(Navipet Mandal) నారాయణపూర్‌కు చెందిన రాచర్ల కిష్టాబాయి ఈనెల 24న నవీపేట బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్న క్రమంలో.. ఆమె మెడలోని బంగారు గొలుసుపై కంజర్‌కు చెందిన కాలుర్ లత, పంతుల విజయ, ఈర్ల సాయికుమార్ కన్నేశారు. సులభంగా డబ్బు సంపాదించాలని షేర్‌చాట్ (Sharechat)లో వీడియో చూసి మరీ దొంగతనానికి పాల్పడ్డారు. వృద్ధురాలును లత, విజయ కత్తితో బెదిరించి కళ్లలో కారం కొట్టి పుస్తెల గుండ్లు, పడిగెలు తీసుకుని పారిపోయారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ(CI) తెలిపారు. చోరీ సొత్తుతో పాటు రూ.50వేల నగదు, చోరీకి వాడిన కత్తి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎస్సై, సిబ్బందిని సీఐ అభినందించారు.