అక్షరటుడే, న్యూఢిల్లీ: Gautam Gambhir | జమ్మూ కశ్మీర్ Jammu Kashmir లోని పహల్గామ్ pahalgam ఉగ్రదాడి terror attack ఘటన యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బైసారన్ మైదానం ప్రాంతంలో అమాయక ప్రజలపై పాక్ టెర్రరిస్టులు చేసిన విచక్షణరహిత నరమేధంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబిక్కుతున్నాయి. మరోవైపు ముష్కరుల ఏరివేతకు భారత భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో టీమిండియా Team India హెడ్ కోచ్ Head Coach, భారత్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీరు Gautam Gambhir కు ఉగ్రవాదుల బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
గంభీర్ ను, అతడి కుటుంబాన్ని చంపేస్తామని ఉగ్రవాదులు మెయిల్స్ emails పంపారు. తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని రెండు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు Delhi police గౌతమ్ ఫిర్యాదు చేశారు. తన ఇంటి దగ్గర బాంబు దాడులు జరుపుతామని హెచ్చరించారని గౌతమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐసీస్ కశ్మీర్ నుంచి ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు తెలిపారు. గౌతమ్ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.