ePaper
More
    Homeటెక్నాలజీMessaging App | ఈ మెసేజింగ్‌ యాప్‌.. చాలా స్పెషల్‌ గురూ..

    Messaging App | ఈ మెసేజింగ్‌ యాప్‌.. చాలా స్పెషల్‌ గురూ..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Messaging App | ట్విట్టర్‌ (Twitter) సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే(Jack Dorsey) సరికొత్త డిసెంట్రలైజ్డ్‌ మెసేజింగ్‌ యాప్‌ బిట్‌ చాట్‌(Bit chat)ను లాంచ్‌ చేశారు. ఆఫ్‌లైన్‌ చాటింగ్‌(Offline chating) కోసం రూపొందించిన ఈ యాప్‌లో పలు ప్రత్యేకతలున్నాయి. ఇతర మెసేజింగ్‌ యాప్‌లు (Messaging app) ఇంటర్నెట్‌ లేకుండా పనిచేయవు. ఇంటర్నెట్‌ (Internet), వైఫై, మొబైల్‌ డాటా అవసరం లేకపోవడం దీని ప్రత్యేకత. అంతే కాదు.. ఫోన్‌ నంబర్‌, యూజర్‌ ఐడీ లాంటివేవీ లేకపోయినా పర్వాలేదు.

    బ్లూటూత్‌ ఆధారంగా ఈ యాప్‌ బ్లూటూత్​లో ఎనర్జీ మెష్‌ నెట్‌వర్క్‌ (Bluetooth Low Energy (BLE) mesh network) ద్వారా పనిచేస్తుంది. అంటే మీ ఫోన్‌ బ్లూటూత్‌ ద్వారా సమీపంలోని ఇతర డివైజ్‌లకు కనెక్ట్‌ అయి మేసేజ్‌లను పంపుతుందన్న మాట. ఇది ప్రస్తుతం బీటా వెర్షన్‌(Beta version)లో యాపిల్‌ టెస్ట్‌ఫ్లైట్‌ ప్లాట్‌ఫాం ద్వారా పరిమిత సంఖ్యలో ఐవోఎస్‌(IOS) వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

    READ ALSO  Open AI | ఓపెన్‌ ఏఐ నుంచి కొత్త బ్రౌజర్‌.. గూగుల్‌కు పోటీ ఇచ్చేనా?

    Messaging App | యాప్‌ ఫీచర్లు..

    ఈ యాప్‌ వినియోగించడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్లు అవసరం లేదు. ఫోన్‌ నంబర్‌ (Phone number), ఈ–మెయిల్‌ లేదా ఇతర వ్యక్తిగత సమాచారం లేకుండా ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ యాప్‌ ద్వారా మన ఐడెంటిటీని దాచిపెట్టి కూడా చాట్‌ చేయవచ్చు.

    వాట్సాప్‌ మాదిరిగానే ఇది కూడా సురక్షితమైనది. ఇందులోనూ ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (End to end encryption) ఉంటుంది. సెంట్రల్‌ సర్వర్‌లు లేకుండా పీర్‌ టు పీర్‌(Peer to peer) కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. అంటే మేసేజ్‌ పంపిన వ్యక్తికి అందుకున్న వ్యక్తికి మాత్రమే ఆ మెసేజ్‌ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల వినియోగదారుల డాటా(Data)కు గోప్యత ఉంటుంది.

    Messaging App | సర్వర్లు లేకపోవడం వల్ల తగ్గనున్న డాటా లీకేజీ ప్రమాదం

    ఇందులో తాత్కాలిక మేసేజ్‌లు పంపడం, చాటింగ్‌ కోసం గ్రూపులను సృష్టించడం, ఆఫ్‌లైన్‌ మెసేజ్‌ స్టోరేజ్‌, ఫార్వర్డింగ్‌, కవర్‌ ట్రాఫిక్‌ వంటి ఫీచర్లున్నాయి. ఇవి ఐఆర్‌సీ(IRC) స్టైల్‌ సంభాషణలను సులభతరం చేస్తాయి. ఈ బిట్‌ చాట్‌ యాప్‌ ఇంటర్నెట్‌ లేని ప్రదేశాల్లో లేదా ఏదైనా విపత్తు సమయంలో కమ్యూనికేట్‌ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

    READ ALSO  Minister Seethakka | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

    Latest articles

    TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో భాగస్వాములు కావాలి..

    అక్షరటుడే, ఇందూరు: TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్​ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి...

    Jal Shakti meeting | కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం.. జల వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jal Shakti meeting | జల వివాదాలపై కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు....

    Governor Jishnu Dev Varma | జిల్లా ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి..

    అక్షరటుడే, ఇందూరు: Governor Jishnu Dev Varma | రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లా పర్యటనలో భాగంగా...

    More like this