అక్షరటుడే, ఎల్లారెడ్డి :Yellareddy | ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి(Thimmareddy village) చెందిన గూల గోవర్ధన్ (26) అమెరికా(America)లో గుండెపోటుతో మృతి చెందాడు.
మృతుని తండ్రి విఠల్ తెలిపిన వివరాలు.. గోవర్ధన్ నాలుగేళ్ల క్రితం చదువు నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఎం.ఎస్. పూర్తి చేసిన అనంతరం అక్కడే జాబ్ చేస్తూ స్థిరపడ్డాడు. ఈ క్రమంలో గుండెపోటుతో గురువారం అక్కడ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో కుటుంబీకులు రోదిస్తున్నారు.