అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలు కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను సైతం వదలడం లేదు.
మహిళలకు బయటే కాదు ఆస్పత్రిలో సైతం భద్రత లేకుండా పోయింది. హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో గల ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో (Andhra Mahila Sabha Hospital) దారుణ ఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగిపై వార్డు బాయ్ (ward boy) అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. అక్కడే ఉన్న రోగి కుటుంబ సభ్యులు సదరు వార్డు బాయ్‌ను చితక బాదారు. అనంతరం నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.