అక్షరటుడే, న్యూఢిల్లీ: Terror Attack | జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ లోయలో ఉగ్రవాదులు హేయమైన చర్యకు పాల్పడ్డారు. ముష్కర మూకలు మతం అడిగి మరీ పర్యాటకుల ప్రాణాలు హరించారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూకలు..హిందువులే లక్ష్యంగా తెగబడ్డారని స్పష్టం అవుతోంది.
‘మీరు ముస్లింలా? అయితే కల్మా చెప్పండి’ అని అడిగి మరీ మతం నిర్ధారించుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఈ కల్మా kalma meaning (కలిమా లేదా షహాదా) what is kalma అంటే ఏంటి? ఇస్లాంలో దీని ప్రాధాన్యం ఏముంది..? అనేది ప్రస్తుతం అందరి ముందున్న ప్రశ్న. 2014లో కెన్యాలో ఓ బస్సుపై జరిపిన దాడిలోనూ అల్-షబాబ్ ఉగ్రవాదులు ఇలానే చేశారు.
Terror Attack | ఇస్లాంలో కల్మా (Kalma) అంటే..
కల్మా / షహాదా (Shahada) అనేది ముస్లింల విశ్వాసానికి మౌలిక శిలగా పేర్కొంటారు. ఇది అల్లాహ్ ఏకత్వాన్ని, మహ్మద్ ప్రవక్త ప్రవక్తత్వాన్ని నమ్మే ప్రకటనగా చెబుతారు. ఇస్లాంలో మొత్తం ఆరు కల్మాలు ఉంటాయి. వాటిలో ప్రతీది ప్రత్యేక ప్రయోజనాన్ని సూచిస్తుంది.
మొదటిది : కల్మా తయ్యిబ్ (Kalma Tayyib) – స్వచ్ఛత
అర్థం: ‘అల్లాహ్ తప్ప మరో దేవుడు లేడు, ఆయన ఒక్కడే, అల్లాహ్ కు భాగస్వామిలేరు, మహ్మద్ ప్రవక్త ఆయన దూత.
రెండోది : కల్మా షహాదా (Kalma Shahada) – సాక్ష్యం
అర్థం: “నేను సాక్ష్యమిస్తున్నా.. అల్లాహ్ తప్ప మరో దేవుడు లేడు, ఆయన ఒక్కడే, అల్లాహ్ కు భాగస్వామిలేరు. మహ్మద్ ప్రవక్త ఆయన సేవకుడు, దూత.
మూడోది : కల్మా తంఝీద్ (Kalma Tamjeed) – మహిమ చేతన
అర్థం: అల్లాహ్ పవిత్రుడు, ఆయనకు స్తుతి, ఆయన తప్ప మరో దేవుడులేడు, అల్లాహ్ నే గొప్పవాడు. శక్తి, బలం అల్లాహ్‌తో తప్ప మరెవ్వరితోనూ సాధ్యం కాదు.
నాలుగోది : కల్మా తౌహీద్ (Kalma Tawheed) – ఏకత్వం
అర్థం: అల్లాహ్ తప్ప మరెవరూ పూజకు అర్హులు కాదు. ఆయన ఒక్కడే, అల్లాహ్ కు భాగస్వామిలేరు. రాజ్యం ఆయనదే, స్తుతి అల్లాహ్ దే. ఆయనే ప్రాణం ఇస్తాడు, తీసుకుంటాడు. అల్లాహ్ కు ఎప్పటికీ మరణం ఉండదు… ఆయన కరుణాశీలుడు, మహిమాన్వితుడు. అల్లాహ్ చేతిలోనే అన్నీ ఉన్నాయి. అల్లాహ్ కు అన్నింటిపై అధికారం ఉంది.
ఐదోది : కల్మా అస్తఘ్ఫార్ (Kalma Astaghfar) – పశ్చాత్తాపం
అర్థం: ప్రభువా! నేను తెలిసీ తెలియక చేసిన, రహస్యంగా / బహిరంగంగా చేసిన పాపాలను మన్నించు. నాకు తెలిసిన, తెలియని పాపాలను మన్నించు. నీవు రహస్యాలుగా పాపాలుగాను కప్పిపుచ్చేవాడవు, క్షమించేవాడవు. అల్లాహ్ నీదే బలం, నీదే శక్తి.
ఆరోది : కల్మా రద్దే కుఫ్ర్ ( Kalma Radde Kufr) – అవిశ్వాసాన్ని తిరస్కరించడం
అర్థం: నేను అల్లాహ్ తప్ప దేవుడులేడని, అల్లాహ్ ఒక్కడేనని, ఆయనకు భాగస్వామిలేరని నేను నమ్ముతున్నాను. నేను బహు దేవారాధన, కుఫ్ర్, అసత్య విశ్వాసాలను తిరస్కరిస్తున్నా. అల్లాహ్.. నీవు ఒకే నిజమైన దేవుడవు, నీవే నా దైవం.