అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bombay High Court | ముంబై రైలు పేలుళ్ల కేసు(Bombay Train Blasts Case)లో బాంబే హైకోర్టు సోమవారం సంచలన తీర్పు చెప్పింది. ఆ కేసులో మొత్తం 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. 2006లో ముంబై సబర్బన్ రైళ్ల(Mumbai Suburban Trains)లో వరుసగా పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో అధికారులు 12 మందిని నిందితులు పేర్కొనగా.. నేరం నిరూపించడంతో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు తెలిపింది. దీంతో నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.
Bombay High Court | అసలు ఏం జరిగిందంటే..
ముంబైలోని పలు సబర్బన్ రైల్లలో 2006 జులై 11న వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 189 మంది ప్రజలు చనిపోయారు. మరో 800 మంది గాయపడ్డారు. ఈ ఘటన అప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై అప్పటి నుంచి విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు 2015లో 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. బాంబులు అమర్చారన్న అభియోగలు ఉన్న ఐదుగురికి మరణ శిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. నిందితుల్లో ఓ వ్యక్తి కరోనాతో 2021లో జైలులో మృతి చెందాడు.
Bombay High Court | హైకోర్టులో అప్పీల్
ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు బాంబే హైకోర్టు(Bombay High Court)ను ఆశ్రయించారు. వారి పిటిషన్ సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) కూడా పిటిషన్ వేసింది. ఈ కేసు విచారణకు 2024 జులైలో హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. సుదీర్ఘంగా విచారణ జరిపిన ధర్మాసనం సోమవారం తీర్పు వెల్లడించింది. 12 మంది నిందితులు నిర్దోషులుగా ప్రకటించింది. వీరిలో ఒకరు మృతి చెందడంతో మిగతా 11 మంది జైలు నుంచి విడుదల కానున్నారు.