అక్షరటుడే, వెబ్‌డెస్క్:May OTT Movies | మే నెలలో పలు సినిమాలు ఓటీటీ(OTT)ల్లో సందడి చేయనున్నాయి. ఇటీవల వెండితెరపై రిలీజైన ఈ మూవీస్ మే నెలలో ఓటీటీల్లోకి రానున్నాయి. ఇందులో టాప్ మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఇవి భారీ అంచనాలతో వచ్చి, బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే ప్రస్తుతం ఓటీటీల్లో టెలికాస్ట్ కానున్నాయి. ఈ ఛిత్రాలు ఏమిటో తెలుసుకుందాం..
May OTT Movies | రాబిన్‍హుడ్(Robinhood)
నితిన్, శ్రీలీల జంటగా నటించిన మూవీ రాబిన్‍హుడ్ (Robinhood). డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించాడు. కామెడీ యాక్షన్ థ్రిల్లర్(Comedy Action Thriller)గా వచ్చిన ఈ సినిమా మార్చి 28న వెండితెరపై విడుదలైంది. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా.. రాబిన్‍హుడ్ ఓటీటీ హక్కులను Zee5 సొంతం చేసుకుంది. మే 5న ఈ మూవీ వచ్చే ఛాన్స్ ఉంది.
May OTT Movies | ఓదెల2(Odela 2)
తమన్నా లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ఓదెల 2’ (Odela 2). దర్శకుడు సంపత్ నంది అశోక్ తేజ డైరెక్ట్ చేశారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్(Amazon Prime) దక్కించుకుంది. ఈ ఛిత్రం మే నెల చివరి రెండో వారంలో వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
May OTT Movies | జాక్ (JACK)
సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఛిత్రం ‘జాక్’(JACK). ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 10న థియేటర్స్లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ చతికిల పడింది. కాగా.. ఈ సినిమా నెల తిరగకుండానే ఓటీటీలోకి రాబోతుందని సమాచారం. ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్(Netflix) దక్కించుకుంది. మే ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో వచ్చే అవకాశం ఉంది.