అక్షరటుడే, వెబ్డెస్క్:DGP | తెలంగాణ నూతన డీజీపీ new DGP telangana రేసులో పలువురు ఐపీఎస్ ఆఫీసర్లు(IPS officers) ఉన్నారు. ఈ మేరకు ఎనిమిది మంది పేర్లను రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Union Public Service Commission)కు పంపించింది.
ప్రస్తుత డీజీపీ జితేందర్(DGP Jitender) త్వరలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో కొత్తవారి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పలువురి పేర్లను పంపింది. రవి గుప్తా (1990 బ్యాచ్) IPS Ravi Gupta, సీవీ ఆనంద్ (1991 బ్యాచ్) IPS CV Anand, డా. జితేందర్ (1992 బ్యాచ్) IPS jitender, ఆప్టే వినాయక్ ప్రభాకర్ (1994 బ్యాచ్) IPS prabhakar, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (1994 బ్యాచ్) IPS kotthakota prabhakar Reddy, బి శివధర్ రెడ్డి (1994 బ్యాచ్) IPS shivadhar reddy, డా సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్) IPS sowmya mishra, శిఖా గోయల్ (1994 బ్యాచ్) IPS Shikha goel పేర్లను రాష్ట్ర ప్రభుత్వం(State Government) సిఫార్సు చేసింది.
ఇందులో అర్హత ఉన్న ముగ్గురి పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. అందులో నుంచి ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది. ఇందులో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 5న, రవి గుప్తా డిసెంబర్ 19న ఉద్యోగ విరమణ పొందనున్నారు. సీవీ ఆనంద్ 2028 జూన్, ఆప్టే వినాయక్ ప్రభాకర్ 2029 అక్టోబర్, బి శివధర్ రెడ్డి 2026 ఏప్రిల్ 28, డా. సౌమ్య మిశ్రా 2027 డిసెంబర్ 30, శిఖాగోయల్కు 2029 మార్చి వరకు సర్వీస్ ఉంది.