అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jammu Kashmir | జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగుదోస్తున్న పాకిస్తాన్‌ను టెర్రరిస్టు స్పాన్సర్ దేశంగా ప్రకటించాలని అమెరికా పెంటగాన్ మాజీ అధికారి Former US Pentagon official మైఖెల్ రూబిన్ అన్నారు. అలాగే, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను Pakistan Army Chief General Asim Munir బిన్ లాడెన్‌తో Bin Laden పోల్చిన మైఖెల్.. అతడ్ని ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్‌లో Israel ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న హమాస్‌ను Hamas పాకిస్తాన్ Pakistan అనుసరిస్తోందని రూబిన్ విమర్శించారు. జమ్మాకాశ్మీర్‌లోని పహల్గామ్ Pahalgamఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా మార్చిన ఉదంతంపై ఆయన స్పందించారు.
Jammu Kashmir | ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు..
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను ప్రాణాంతక ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌తో Osama bin Laden మైఖేల్ పోల్చారు. అసిమ్ మునీర్‌ను ఉగ్రవాదిగా ముద్ర వేయాలని కోరారు. “ఒసామా బిన్ లాడెన్, అసిమ్ మునీర్ ఇద్దరూ ఒక్కటే వారి మధ్య ఉన్న ఏకైక తేడా ఏమిటంటే ఒసామా బిన్ లాడెన్ ఒక గుహలో నివసించాడు. అసిమ్ మునీర్ ఒక రాజభవనంలో Raj Bhavan నివసిస్తున్నాడు. అంతే తేడా. అంతకు మించి ఇద్దరూ ఒకటే, వారి ముగింపు కూడా ఒకేలా ఉండాలి” అని రూబిన్ వ్యాఖ్యానించారు.
Jammu Kashmir | ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రంగా పాకిస్తాన్
పాకిస్తాన్‌పై మైఖేల్ తీవ్ర విమర్శలు చేశారు. “ఇది షాకింగ్ గా ఉంది, కానీ ఇది పంది మీద లిప్ స్టిక్ వేయవచ్చని పాక్ మీకు చూపిస్తుంది. కానీ అది ఇప్పటికీ పందియే. పాకిస్తాన్ ఉగ్రవాద స్పాన్సర్ కాదని మీరు (పాక్) నటించవచ్చు, కానీ మనం దానిని సాధారణీకరించడానికి ఎంత ప్రయత్నించినా అది ఉగ్రవాద స్పాన్సర్ గానే ఉందని” అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్ US Vice President J.D. Vaughn భారత పర్యటన నుంచి దృష్టి మళ్లించడానికే పాకిస్తాన్ మరోసారి ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తోందని రూబిన్ మండిపడ్డారు. “అప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు క్లింటన్ Former US President Clinton భారత పర్యటనలో ఉన్నప్పుడు కాశ్మీర్‌లో ఇలాగే దాడి జరిగింది. ఇప్పుడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తుండగా పహల్గామ్‌లో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. ఈ దాడిపై పాక్ స్పందిస్తూ తమకు సంబంధం లేదని, స్థానికులే ఈ ఘోరానికి పాల్పడ్డారని ఆరోపిస్తోంది. కానీ ఇలాంటి ఎన్ని నాటకాలు ఆడినా ఆ దేశ వక్రబుద్ధి ఏమిటో అందరికీ తెలుసు. పహల్గాం దాడికి మనం (అమెరికా) America చేయాల్సింది ఒక్కటే. పాక్‌ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా ప్రకటించడం, ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించడమేనని” తెలిపారు.
Jammu Kashmir | హమాస్ తరహలోనే..
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి, పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి మధ్య పోలికలు ఉన్నాయని రూబిన్ తెలిపారు. రెండు దాడుల్లోనూ అమాయకులను బలి తీసుకున్నారని చెప్పారు. ఇజ్రాయెల్ Israel లోని ఉదారవాద యూదులను, భారతదేశంలోని మధ్యతరగతి హిందువులను లక్ష్యంగా చేసుకున్నారని వివరించారు. “అక్టోబర్ 7 2023న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసినప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఇది ప్రత్యేకంగా యూదులకు వ్యతిరేకంగా జరిగింది. అలాగే, గాజా స్ట్రిప్ తో శాంతి, సాధారణ స్థితిని కోరుకునే అత్యంత ఉదారవాద యూదులకు వ్యతిరేకంగా దాడి జరిగందని ” అని రూబిన్ తెలిపారు.