Site icon aksharatoday.in

Jurala Project | జూరాల ప్రాజెక్ట్​కు పొంచి ఉన్న ముప్పు

Jurala Project

Jurala Project | జూరాల ప్రాజెక్ట్​కు పొంచి ఉన్న ముప్పు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jurala Project | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. కృష్ణానదికి(Krishna River) వరద పెరగడంతో జురాల ప్రాజెక్ట్​ నిండుకుండలా మారింది. జురాల ప్రాజెక్ట్​కు కొద్దిరోజులుగా భారీ ఇన్​ఫ్లో వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు వరద ఆధారంగా గేట్లను ఎత్తుతూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం సైతం ప్రాజెక్ట్​(Jurala Project)కు వరద తాకిడి పెరిగింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తగా 9వ నంబర్​ గేట్​ రోప్​ తెగిపోయింది. 12, 16, 24, 26వ గేట్ల రోప్​(Rope gates)లు కూడా లూజ్​ అయినట్లు సమాచారం. ఆ గేట్లను ఎత్తితే వాటి రోప్​లు కూడా తెగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్​ఫ్లో ఆధారంగా 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న తుంగభద్ర(Tungabhadra), ఆల్మట్టి డ్యాంలు(Almatti Dams) నిండితే జురాలకు మరింత వదర పోటెత్తే అవకాశం ఉంది. అప్పుడు అన్ని గేట్లు ఎత్తాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో 9వ నంబర్​ గేటు రోప్​ తెగిపోవడం, మరికొన్ని గేట్ల రోప్​లు బలహీనంగా ఉండడంతో ప్రాజెక్ట్​ భద్రత ప్రమాదంలో పడింది.

Jurala Project | ఇటీవలే మరమ్మతులు

కృష్ణానదిపై ఉన్న జురాల ప్రాజెక్ట్​ తెలంగాణ(Telangana)కు ఎంతో కీలకం. ఇక్కడ రెండు విద్యుత్​ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఆ ప్రాజెక్ట్​ కింద వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అలాంటి ప్రాజెక్ట్​ నిర్వాహణను అధికారులు గాలికి వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవిలోనే ప్రాజెక్ట్​ గేట్లకు మరమ్మతులు చేశారు. అయితే రిపేర్ సరిగా చేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. జూరాలకు వరద పెరుగుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 

Jurala Project | ప్రాజెక్ట్​లపై పట్టింపు కరువు

రాష్ట్రంలో ప్రాజెక్ట్​లపై ఆయా శాఖల అధికారులు సరైన పర్యవేక్షణ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్ట్​ గేట్ల మరమ్మతులు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. 9.8 టీంఎసీల సామర్థ్యంతో నిర్మించిన జురాల కృష్ణానదిపై తెలంగాణలో ఉన్న తొలి ప్రాజెక్ట్​. పైనుంచి వరద వస్తే మొదట తట్టుకోవాల్సింది జురాల ప్రాజెక్టే. అలాంటి డ్యామ్​ నిర్వహణపై అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేసినా.. రోప్​ తెగిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా.. 2023 వానాకాలంలో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్​కు భారీ వరద వచ్చింది. ఆ సమయంలో సైతం పలు గేట్లు ఎత్తే అవకాశం లేకపోవడంతో జలాశయం నిండి.. పైనుంచి వరద పోయింది. దీంతో దిగువన ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. తర్వాత వరద తగ్గుముఖం పట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పుడు జురాల విషయంలోనూ వరద అధికంగా వస్తే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version