More
    HomeతెలంగాణRain Alert | నేటి నుంచి ఐదు రోజుల పాటు భారీ వ‌ర్షాలు

    Rain Alert | నేటి నుంచి ఐదు రోజుల పాటు భారీ వ‌ర్షాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | మొన్న‌టి వ‌ర‌కు ఎండ‌ల‌తో అట్టుడికిన తెలంగాణ (Telangana)కి ఇప్పుడు చ‌ల్ల‌ని క‌బురు అందింది. రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు పిడుగులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు వ‌స్తాయ‌ని హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి.

    ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్‌ (Yellow Alert) జారీ చేశారు. ఈ జిల్లాల్లో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పిడుగుల ప్రమాదం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్ల కింద ఆశ్రయం పొందరాదని హెచ్చరించారు.

    READ ALSO  Cm Revanth Habbits | రేవంత్‌ మందు ముట్టరు.. సిగరెట్​ తాగరు.. ఎంపీ కొండా ఆసక్తికర వ్యాఖ్యలు

    మిగిలిన జిల్లాల్లోనూ ఈదురు గాలులతో (Thunderstorms) కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. తెలంగాణకు రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత కొన్ని రోజుల వరకు భారీగా వర్షాలు కురిసినా.. తర్వాత కొన్ని రోజులు ఎండలతో ప్రజలు సతమతం అయ్యారు. తర్వాత మళ్లీ వర్షాలు ఎక్కుగా కురవలేదు. నేటి నుంచి మళ్లీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) దాని పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ కావడంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి.

    Latest articles

    Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా...

    Today Gold Price | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ధ‌ర ఎంత అంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు త‌గ్గుతాయో చెప్ప‌లేని...

    Pre market analysis | పాజిటివ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre market analysis : గ్లోబల్‌ మార్కెట్(Global markets)లో పాజిటివ్‌ మూడ్‌ కొనసాగుతోంది. గురువారం యూఎస్‌(US),...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం విక్రమ సంవత్సరం – 2081 పింగళ ఉత్తరాయణం గ్రీష్మ రుతువు రోజు – శుక్రవారం మాసం – ఆషాఢ పక్షం...

    More like this