అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | పోలీస్ శాల ఇమేజ్ పెంచే విధంగా సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సూచించారు. ధర్పల్లి సర్కిల్ కార్యాలయాన్ని (Dharpally Police station) మంగళవారం సందర్శించారు. పోలీస్‌స్టేషన్‌లో కేసులకు సంబంధించిన ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
CP Sai Chaitanya | ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి..
ప్రజల భద్రపై సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ పేర్కొన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల (Case under investigation) ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని సర్కిల్ ఇన్స్పెక్టర్కు (Circle Inspector) సూచించారు. ఈ సర్కిల్ పరిధిలో సైబర్ నేరాల జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
CP Sai Chaitanya | విలేజ్ ఆఫీసర్లే కీలకం..
సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో సిబ్బంది మమేకమవ్వాలని సీపీ సూచించారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.
ఆన్లైన్ బెట్టింగ్ (Online betting) కారణంగా జరిగే అనర్థాలను వివరిస్తూ.. యువత ఆ వైపు వెళ్లకుండా చూడాలన్నారు. సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది 24గంటలూ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించవద్దని సూచించారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ధర్పల్లి సీఐ భిక్షపతి, సిరికొండ ఎస్సై రామకృష్ణ ఏఎస్సై కళ్యాణి, తదితరులున్నారు.