అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BJP President Ramachandra Rao | పార్టీ తనకు గొప్ప అవకాశం ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. ఇటీవల ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. శనివారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం (Bhagyalakshmi Ammavari Temple)లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
పార్టీ తనకు గొప్ప అవకాశం ఉచ్చిందని ఆయన పేర్కొన్నారు. కిషన్ రెడ్డి(Kishan Reddy) నేతృత్వంలో అనేక సంవత్సరాలుగా రాష్ట్ర బీజేపీకి మార్గదర్శకం అయిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ (Telangana) ప్రజలకు బీజేపీ అండగా నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు.
BJP President Ramachandra Rao | కొత్త అధ్యక్షుడికి అనేక సవాళ్లు
రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు. దీంతో కేంద్ర నాయకత్వం రెండేళ్లుగా ఈ పదవిపై ఎటు తేల్చకుండా జాప్యం చేస్తూ వచ్చింది. తాజాగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు సర్వం సిద్ధం అవుతున్న తరుణంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా రాంచందర్ రావు (Ramachandra Rao)కు పార్టీ పగ్గాలు అప్పగించింది. అధ్యక్ష పదవి కోసం ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, బండి సంజయ్ యత్నించారు.
రాంచందర్‌రావుకు బాధ్యతలు అప్పగించడంతో వారిలో పలువురు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో అందరిని కలుపుకొని వెళ్లడం కొత్త అధ్యక్షుడికి సవాల్‌గా మారనుంది. అంతేగాకుండా రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించడంతో పాటు ఎక్కువ స్థానాలు సాధించాలని బీజేపీ (BJP) భావిస్తోంది. ఈ క్రమంలో నూతన అధ్యక్షుడు ఎలా ముందుకు సాగుతారనేది చూడాలి.