అక్షరటుడే, వెబ్డెస్క్: Vishaka Masam | మాసాలన్నింట్లో వైశాఖమాసం(Vishaka Masam) ఆధ్యాత్మికంగా ఉత్తమమైనదిగా చెబుతారు. దీనికి మరో పేరు మాధవ మాసం. మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో తులసి దళాలతో లక్ష్మీ సమేత మహావిష్ణువును పూజిస్తే ముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఎవరైతే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో దానధర్మాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇది మండు వేసవి(Summer)లో వచ్చే మాసం.. కాబట్టి ఈ సమయంలో వేసవి తాపం అధికంగా ఉంటుంది. అందుకే ఈ మాసంలో భగవత్ ఆరాధనతోపాటు పరోపకారానికి ప్రాధాన్యం ఇవ్వాలంటారు పెద్దలు. మంచినీళ్లు, మజ్జిగ, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు, చెప్పులు, గొడుగు వంటివి దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారని చెబుతారు. సోమవారం(Monday)నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు(Festivals), తిథులేమిటో తెలుసుకుందామా..
ఏప్రిల్ 28 : వైశాఖ శుద్ధ పాడ్యమి: భరణి కార్తె ప్రారంభం.
ఏప్రిల్ 30 : అక్షయ తృతీయ, బసవేశ్వర జయంతి, పరశురామ జయంతి, సింహాద్రి అప్పన్న చందనోత్సవం.
మే 2 : ఆది శంకరాచార్య జయంతి, రామానుజ జయంతి.
మే 4 : భానుసప్తమి, మృకండ మహర్షి జయంతి.
మే 7 : వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన, వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి.
మే 8 : ఏకాదశి: మతత్రయ ఏకాదశి, అన్నవరం సత్యదేవుని కళ్యాణం.
మే 10 : శనిత్రయోదశి.
మే 11 : నృసింహ జయంతి.
మే 12 : వైశాఖ పౌర్ణమి, మహా వైశాఖి, గౌతమ బుద్ధ జయంతి, బుద్ధ పూర్ణిమ, కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి.
మే 15 : సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం, నారద జయంతి.
మే 16 : సంకష్ట హర చతుర్థి.
మే 22 : హనుమజ్జయంతి.
మే 23 : సర్వ ఏకాదశి.
మే 25 : రోహిణి కార్తె ప్రారంభం.
మే 26 : వైశాఖ బహుళ చతుర్దశి/అమావాస్య: సరస్వతి నది పుష్కరాలు సమాప్తం.
మే 27 : వైశాఖ బహుళ అమావాస్య: ఈ రోజుతో వైశాఖ మాసం సమాప్తం.