అక్షరటుడే, వెబ్‌డెస్క్: SERP employees | తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులకు SERP employees ప్రభుత్వం telanagana government గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సాధారణ బదిలీలకు ఆమోదం తెలిపింది. వంద శాతం సాధారణ బదిలీలు జరిపేందుకు అనుమతినిస్తూ.. మంత్రి సీతక్క Minister Seethakka ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సెర్ప్ ఉద్యోగులు serp employees telangana హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సెర్ప్‌లో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పనిచేస్తున్నారు. వీరిలో మండల సమాఖ్య కమ్యూనిటీ కో`ఆర్డినేటర్స్ Coordinators, బుక్ కీపర్స్ Bookkeepers, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్స్ Community Coordinators, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్, డ్రైవర్స్, ఆఫీస్ అసిస్టెంట్స్, ఏపీఎం APMలు ఉన్నారు. వీరిలో చాలా మంది పదేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నారు. అలాగే కొందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ.. బదిలీలు చేపట్టలేదు. ఎట్టకేలకు బదిలీలకు సంబంధించి మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.