అక్షరటుడే, కామారెడ్డి : Kamaredy | కామారెడ్డి (Kamareddy) మండలం నర్సన్నపల్లి రైల్వే గేటు (Narsannapalli Railway Gate) వద్ద 550 గ్రాముల ఎండు గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న ప్యాకెట్లలో ఎండు గంజాయి సరఫరా చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ సీఐ (Excise CI) సుందర్ సింగ్ ఆధ్వర్యంలో గురువారం నర్సన్నపల్లి రైల్వే గేటు వద్ద తనిఖీ చేపట్టారు.
కామారెడ్డి పట్టణంలో నివాసం ఉంటున్న అహ్మద్ బిన్ అసద్ అనే వ్యక్తి బైక్పై గంజాయిని తీసుకుని వెళ్తుండగా పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి బైక్ను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో సబ్ ఇన్స్పెక్టర్ శరత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ బాల్రెడ్డి, అయోస్, కానిస్టేబుళ్లు మారుతి, శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్, సరిత, అపూర్వ తదితరులు పాల్గొన్నారు.