అక్షరటుడే, బాన్సువాడ:Banswada Degree College | బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను(silver jubilee celebrations) పూర్వ విద్యార్థులు alumni students celebrations విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) పేర్కొన్నారు. మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 24న నిర్వహించే కళాశాల సిల్వర్ జూబ్లికి ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) విచ్చేస్తున్నారని తెలిపారు. బాన్సువాడలో డిగ్రీ కళాశాల కోసం ఎంతో కృషి చేశానని, 1997లో జీవో రాగా.. 1998లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా బాన్సువాడ కళాశాల కొనసాగుతుందన్నారు.
ఇప్పటి వరకు కళాశాలలో చదువుకున్న 10వేల మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. కళాశాల న్యాక్ బీ ప్లస్ గ్రేడ్‌తో naac b grade స్వయం ప్రతిపత్తి కలిగి ఉందన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ వేణుగోపాలస్వామి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ agro industries chairman kasula balaraju, బీర్కూరు ఏఎంసీ ఛైర్మన్ శ్యామల, నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, వెంకన్న గుప్తా, నార్ల సురేష్ గుప్తా, ఎజాజ్, ఖాలేక్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.