అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah) మరో వివాదంలో చిక్కుకున్నారు. బెళగావి belgaovi జరిగిన సభలో ఓ పోలీస్ అధికారిపై చెయ్యి చేసుకోబోయారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడిపై సిద్ధరామయ్య రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌తో యుద్ధం అవసరం లేదు.. మేం ఇందుకు అనుకూలం కాదు.. శాంతియుత పరిస్థితులు ముఖ్యం. ప్రజలకు భద్రత ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఇవి కాస్త పాకిస్తాన్ మీడియాలో ప్రసారమయ్యాయి. దీంతో బీజేపీ ఈ విషయమై తీవ్రంగా మండిపడింది. ఈ నేపథ్యంలో బెగళావిలో జరిగిన సభలో బీజేపీ నాయకులు సభ స్థలంలోకి దూసుకువచ్చారు.
ఈ క్రమంలో ఆయన పోలీస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఒకానొక సమయంలో ఆయనపై చెయ్యి చేసుకోబోయారు. దీంతో సదరు పోలీస్ అధికారి వెనక్కి జరిగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. కాగా.. సీఎం సిద్ధరామయ్యపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ಹೇ ಬಾರಯ್ಯ ಇಲ್ಲಿ, ಯಾವನ್ ಅವ್ನು ಎಸ್ಪಿ?, ಬೆಳಗಾವಿ ಹೆಚ್ಚುವರಿ ಎಸ್ಪಿ ವಿರುದ್ಧ ಸಿಎಂ ಗರಂ – ವೇದಿಕೆಯಲ್ಲೇ ತರಾಟೆ! https://t.co/TglsVU6kS7… #Belagavi #Siddaramaiah #Politics #Congress #BelagaviPolice @INCKarnataka @BJP4Karnataka pic.twitter.com/VeZ8OQtqyg
— PublicTV (@publictvnews) April 28, 2025