అక్షరటుడే, వెబ్‌డెస్క్: Madhya Pradesh | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది.
కాగా.. భారీ వర్షాల దాటికి రూ.40 కోట్లతో నిర్మించిన ఓ వంతెన నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. మధ్యప్రదేశ్‌లోని రాష్ట్ర రహదారి 22 (State Highway 22)పై ఇటీవల రూ.40 కోట్లతో వంతెన నిర్మించారు. శనివారం కురిసిన భారీ వర్షానికి ఆ వంతెన మొత్తం కొట్టుకుపోయింది.
రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్– హోషంగాబాద్‌ను కలుపుతూ నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారలు చర్యలు చేపట్టారు. ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు.
దీనిపై అధికారులు మాట్లాడుతూ.. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వంతెన దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. దీంతో వాహనాలను దారి మళ్లించామని చెప్పారు. ఇండోర్‌లోని మేఘదూత్ గార్డెన్ సమీపంలో భారీ వర్షానికి రోడ్డు కుంగిపోయింది. కాగా.. ఈ ఘటనలపై మంత్రి కైలాష్ విజయవర్గియా దర్యాప్తునకు ఆదేశించారు.