అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijayawada | ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని (Vijayawada City) గవర్నర్‌పేట అన్నపూర్ణ థియేటర్ (Annapurna Theater) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక రూమ్‌లో ఇద్దరు యువకులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
క్యాటరింగ్ పని చేసే ఇద్దరు యువకులు స్థానికంగా ఒక రూమ్‌లో అద్దెకు ఉంటున్నారు. అయితే బుధవారం వారు హత్యకు గురయ్యారు. దుండగులు కత్తులతో వారిని పొడిచి చంపారు. ఓ రౌడీ షీటర్ వారిని చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి గదికి వచ్చిన రౌడీ గొడవ పడి.. అనంతరం కత్తులతో పొడిచి చంపినట్లు చెబుతున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు విజయవాడ టూ టౌన్ పోలీసులు తెలిపారు.