ePaper
More
    HomeతెలంగాణRTC MD Sajjanar | పిచ్చి పీక్స్‌కి వెళ్ల‌డం అంటే ఇదేనేమో.. ప‌ట్టాల‌పై ప‌డుకొని సెల్ఫీ...

    RTC MD Sajjanar | పిచ్చి పీక్స్‌కి వెళ్ల‌డం అంటే ఇదేనేమో.. ప‌ట్టాల‌పై ప‌డుకొని సెల్ఫీ వీడియో

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: RTC MD Sajjanar | సోషల్ మీడియా ఫేమ్ కోసం యువత చేస్తున్న పిచ్చి ప్రయత్నాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వ్యూస్‌, లైక్స్‌ కోసం ప్రమాదకర వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేయడమే నయా ట్రెండ్ అయిపోయింది. అయితే కొన్ని సంద‌ర్భాల‌లో ఇలాంటివి తేడా కొట్ట‌డంతో ప్రాణాలు పోయే అవ‌కాశం కూడా ఉంది. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న అంద‌రూ ఉలిక్కిప‌డేలా చేసింది. ఒక యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ కావాలన్న ఉద్దేశంతో రైలు వెళ్తున్న సమయంలో పట్టాలపై పడుకుని వీడియో తీసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరిలోనూ ఆందోళన కలిగింది.

    RTC MD Sajjanar | రీల్స్ పిచ్చితో..

    రైలు కింద నుంచి తృటిలో తప్పించుకున్నప్పటికీ, అతడి ప్రవర్తనపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TSRTC MD VC Sajjanar) తీవ్రంగా మండిపడ్డారు. జూలై 22న ట్విటర్‌ వేదికగా స్పందించిన వీసీ సజ్జనార్.. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం యువత ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఈ తరహా చర్యలు అత్యంత ప్రమాదకరమైనవే కాదు, నేరమైనవిగా కూడా పరిగణించాలి. ఇలాంటి పనులు చేసే వారు మానసికంగా అస్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి కౌన్సిలింగ్ ఇవ్వడం తప్పనిసరి,” అన్నారు. అలాగే, రీల్స్ కోసం రైలు పట్టాలపై (Train Tracks) పడుకోవడం పిచ్చికి ప‌రాకాష్ట‌. ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే తల్లితండ్రులు ఎలాంటి బాధను అనుభవిస్తారో ఆ యువకుడికి అవగాహన లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

    READ ALSO  RTC tour package | తమిళనాడు తీర్థ యాత్రకు ఆర్టీసీ టూర్ ప్యాకేజ్

    సజ్జనార్ ట్వీట్‌లో (Sajjanar Tweet) వీడియోను జతచేసి, పెద్ద ఎత్తున అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ తరహా వీడియోలు యువతను తప్పుదారిలోకి తీసుకువెళ్తున్నాయన్నారు. వైరల్ కావాల‌ని ఇలాంటి పిచ్చి ప‌నులు చేస్తుండ‌డం ఏదో ఒక రోజు ప్ర‌మాదంలో ప‌డేయ‌క త‌ప్ప‌దు. ఈ ఘటనపై స్థానిక రైల్వే పోలీసులు(Local Railway Police) చర్యలు చేపట్టే అవకాశం ఉంది. రైల్వే చట్టాల ప్రకారం, పట్టాలపై అనధికారంగా ప్రవేశించడం నేరమే. ఇందుకు జరిమానా లేదా శిక్ష కూడా విధించవచ్చు.

    View this post on Instagram

    A post shared by Akshara Today (@aksharatoday)

    Latest articles

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం వితరణ.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార...

    Achuthanandan | అచ్యుతానందన్​ మృతి కమ్యూనిస్ట్​ పార్టీకి తీరనిలోటు

    అక్షరటుడే, ఇందూరు: Achuthanandan | కేరళ మాజీ సీఎం(Kerala), కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైన అచ్యుతానందన్​ మృతి పార్టీకి...

    Maharashtra | భర్తను చంపి.. ఇంట్లోనే పూడ్చి.. శుభ్రంగా టైల్స్ వేసిన ఉత్తమ పత్ని..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharashtra : భర్తను భార్య చంపడం ట్రెండింగ్​ (trending) అనుకుంటున్నారేమో.. కానీ, రోజుకో ఘటన వెలుగుచూస్తోంది....

    CP Sai Chaitanya | పోలీసు శాఖ ఇమేజ్ పెంచేలా సిబ్బంది పనిచేయాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | పోలీస్ శాల ఇమేజ్ పెంచే విధంగా సిబ్బంది నిక్కచ్చిగా...

    More like this