అక్షరటుడే ఇందూరు: TGO’s Nizamabad | తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల (Telangana Gazetted Employees) బోనాల ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగులు బోనాలతో పాత కలెక్టరేట్ వద్ద ఉన్న ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి సారే సమర్పించారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Urban MLA Dhanpal Suryanarayana), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai chaitanya), సంఘం అధ్యక్షుడు అలుక కిషన్ (Aluka Kishan), శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.
TGO’s Nizamabad | ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసం…
ఉద్యోగుల బోనాల ఉత్సవాలకు పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సాంప్రదాయ ఉట్టిపడేలా బోనాల ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఉద్యోగులు, భక్తులకు మహా అన్న ప్రసాదం చేపట్టారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో (Ashada masam) టీజీవోల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రతినిధులు పేర్కొన్నారు.
